
రూ.167.50 కోట్ల రుణాల పంపిణీ
తిరువళ్లూరు: స్వయం ఉపాధి సంఘాలకు మహిళలకు రుణాలు పంపిణీ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు వాయిదాల చెల్లింపును సక్రమంగా చేయాలని తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ సూచించారు. తిరువళ్లూరు జిల్లాలోని 15,757 స్వయం ఉపాధి సంఘాలకు రూ.167.50 కోట్ల బ్యాంకు రుణాలను పంపిణీ చేసే కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లాలో స్వయం ఉపాధి సంఘాల ప్రతినిధుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 19,439 స్వయం ఉపాధి సంఘాలు వున్నాయని వీటిలో మొత్తం 2,52,707 మంది సభ్యులు వున్నట్టు తెలిపారు. మహిళా ప్రాజెక్టు అధికారి సెల్వరాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ తెన్నరసు పాల్గొన్నారు.