
ఎంవీఐపై లారీడ్రైవర్ దాడి
తిరువళ్లూరు: నిబంధనలను అతిక్రమంచిన కంటైనర్ లారీకి రూ.40 వేలు జరిమానా విధించడంతో లారీ డ్రైవర్ ఎంవీఐపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పూందమల్లిలో చెక్‌పోస్టు వుంది. చెక్‌పోస్టులో సోమవారం రాత్రి వాహనాల తనిఖీల్లో ఎంవీఐ చంద్రన్ విధులు నిర్వహిస్తున్నారు. ఆసమయంలో నాగాలాండ్‌కు చెందిన కంటైనర్ లారీ చైన్నె వైపు వెళుతుండగా ఎంవీఐ చంద్రన్ కంటైనర్‌ను ఆపడానికి యత్నించగా ఆగకుండా వెళ్లిపోయింది. లారీని వెంబడించిన చంద్రన్ పూందమల్లికి సమీపంలో ఆపి డాక్యుమెంట్లు లేవని రూ.40 వేలు జరిమానా విధించారు. ఆగ్రహించిన లారీ డ్రైవర్ మహ్మద్‌అలీ(27) ఎంవీఐపై దాడి చేశాడు. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మహ్మద్‌అలీని అరెస్ట్ చేశారు. దాడిలో గాయపడ్డ ఎంవీఐని పూందమల్లి ప్రభుత్వ వైద్యశాలో చేర్పించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.