
రెండు లారీలు ఢీ
తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొనడంతో డ్రైవర్ పరిస్తితి విషయంగా మారింది. లారీలో టైర్ కంపెనీకి వెళ్తుతున్న రబ్బర్ పొడి రోడ్డులో పడిపోవడంతో పాటూ లారీలు రోడ్డు మధ్యలోనే ఆగిపోవడంతో తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలో దాదాపు రెండుగంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాలు.. చైన్నె మనలి నుంచి అరక్కోణంలోని టైర్ తయారు చేసే కంపెనీకి రబ్బర్ పొడితో సరకు మంగళవారం బయలుదేరింది. లారీ తిరువళ్లూరు జిల్లా శిరువానూర్ వద్ద వస్తున్న సమయంలో తిరుత్తణి నుంచి చైన్నె వైపు వెళ్ళుతున్న సిమెంట్ లారీ సరకు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాధంలో లారీలోని రబ్బర్ పొడి రోడ్డుపై భారీ చెదిరిపోయింది. కాగా ప్రమాదంలో సిమెంట్ లారీ డ్రైవర్ గురుస్వామి తీవ్రంగా గాయపడ్డారు. ఇతను శివగాశీ జిల్లా అరుకోటై ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.