
కలిసిమెలిసి జీవించాలి
వేలూరు: సమాజంలో ప్రతి ఒక్కరితోను కలిసి జీవించేందుకు ప్రయత్నం చేయాలని వేలూరు సీఎంసీ ఆసుపత్రి చిత్తూరు క్యాంపస్ సైకాట్రిస్ట్ డాక్టర్ సజిన్ టిటో అన్నారు. వేలూరు తోటపాళ్యంలోని కేరళ సమాజం అద్వర్యంలో ఓణం పండుగ వేడుకలు, 44 వార్షికోత్సవ కార్యక్రమం ఆ సంఘం వ్యవస్థాపక అద్యక్షులు రాధాక్రిష్ణన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడున్న ప్రజలు విద్యలో అభివృద్ది చెందిన వారుగా ఉండాలన్నారు. కేరళలో 90 శాతం పురుషులు, 92 శాతం మహిళలు విద్యా వేత్తలుగా ఉన్నారన్నారు. కేరళ రాష్ట్ర ప్రజలు వారు జీవించడంతో పాటూ వీరికి సంబందించిన వారందరినీ కూడా అభివృద్ధికి దోహద పడుతారన్నారు. అనంతరం కేరళ సమాజం అద్వర్యంలో నిర్వహించి వివిధ పోటీలకు బహుమతులు, సర్టిఫికెట్లును అందజేశారు. అదే విధంగా కేరళ సంప్రదాయం ప్రకారం కూచిపూడి నాట్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలూరు శ్రీపురం బంగారుగుడి డైరెక్టర్ సురేష్‌బాబు, కేరళ సమాజం కార్యదర్శి రమేష్ క్రిష్ణన్, కోశాధికారి సేదు మాదవన్, ట్రస్టీ ప్రభాకరన్, రంజిత్, నిర్వహకులు పాల్గొన్నారు.