
సముద్రంలో సిరియా వాసి రక్షింపు
సాక్షి, చైన్నె : బెలిజ్ కార్గో నౌకలో ప్రయాణిస్తున్న సిరియాకు చెందిన సిబ్బంది గాయపడ్డ సమాచారంతో భారత కోస్టు గార్డు వర్గాలు చైన్నె నుంచి తక్షణం రంగంలోకి దిగారు. అతడిని చికిత్స నిమిత్తం చైన్నెకు తీసుకొచ్చారు. మాల్దీవుల నుంచి కాకినాడ వైపుగా వెళ్తున్న బెలిజ్ కార్గో నౌకలో పనిచేస్తున్న సిబ్బంది అబ్దుల్ ఖాదర్ యాహ్యా తలకు ప్రమాదవశాత్తు తీవ్ర గాయమైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని రక్షించాలని చైన్నెలోని మారిటైమ్ రెస్క్యూ కో ఆర్టినేషన్ సెంటర్‌కు సమాచారం అందింది. ఆ నౌక చైన్నె నుంచి 200 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌చేపట్టారు. మంగళశారం ఇండియన్ కోస్టు గార్డు సిఫ్ , హైస్పీడ్ ఇంటర్ సెప్టర్ బోట్‌లో వైద్య బృందం అక్కడికి చేరుకన్నారు. అతడికి ప్రథమ చికిత్సలు నిర్వహించి, ఉన్నత చికిత్స నిమిత్తం చైన్నె తీసుకొచ్చారు. చైన్నెలో అతడిని సంబంధిత నౌక యజమానికి చెందిన ఏజెంట్‌కు అప్పగించగా ఉన్నత వైద్యనిమిత్తం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

సముద్రంలో సిరియా వాసి రక్షింపు