
విజయ్ పర్యటనకు అనుమతి ఇవ్వాలి
తిరువళ్లూరు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణి, తిరువళ్లూరు, గుమ్మిడిపూండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారం, భారీ బహిరంగ సభ, రోడ్‌షోలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్టీ నేతలు మంగళవారం ఎస్పీ వివేకానంద శుక్లాకు వినతి పత్రం అందజేశారు. అందులో తిరువళ్లూరులోని ప్రధాన జంక్షన్ కామరాజర్ విగ్రహం వద్ద, గుమ్మిడిపూండిలో బజారువీధి, తిరుత్తణిలోని కమల థియేటర్ ప్రాంతాల్లో అనుమతి ఇవ్వాలని కోరారు. టీవీకే నేతల వినతి పత్రానికి పోలీసుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు నేతలు తెలిపారు. తిరుచ్చిలో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో వుంచుకుని పోలీసులు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించే అవకాశం వుంది. ఎస్పీని కలిసిన వారిలో జిల్లా కన్వీనర్‌లు గుమ్మిడిపూండి విజయకుమార్, తిరుత్తణి ఢిల్లీ, తిరువళ్లూరు కుట్టి అలియాస్ ప్రకాషం వున్నారు.