క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 16 2025 7:31 AM | Updated on Sep 16 2025 7:31 AM

క్లుప

క్లుప్తంగా

● విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం

నేటి నుంచి కళాఉత్సవం

కొరుక్కుపేట: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలు, ప్రభుత్వ నిర్వహణలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో తొలిసారిగా కళా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కళా ఉత్సవం మంగళవారం నుంచి(16వ తేదీ) ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం 24 రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో మైమ్స్‌, ట్రెజర్‌ హంట్‌, కథా రచన, కవిత్వం, నృత్యం, వ్యాఖ్యానం, వక్తృత్వ, తోలుబొమ్మలాట, షార్ట్‌ ఫిల్మ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, డిబేట్స్‌, కామెడీ, వంటలు, పొటోగ్రఫీ పోటీలు ఉన్నాయి. ఈ కళా ఉత్సవాల నిర్వహణ కోసం తమిళనాడు స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రతి కళాశాలకు రూ.2 లక్షలు అందిస్తోంది. 252 కళాశాలల నుండి 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ కళా ఉత్సవంలో పాల్గొంటారు. ఈ పోటీలు విద్యార్థుల సృజనాత్మకతను ప్రదర్శించడానికి, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రూపొందించబడ్డాయని అధికారులు వెల్లడించారు. కళాశాల స్థాయిలో ఆర్ట్‌ ఫెస్టివల్‌ పోటీలలో పాల్గొన్నందుకు సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. ఈ పోటీలు విద్యార్థులకు విశ్వవిద్యాల యం, రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడతాయి. ప్రతి విద్యార్థి ఆర్ట్‌ ఫెస్టివల్‌లో కనీసం ఒక పోటీ లో పాల్గొనాలని ప్రణాళిక చేయబడింది. ఈ పోటీ లు కళాశాలల్లో విద్యార్థుల మధ్య స్నేహ భావాన్ని సృష్టించడంలో సహాయపడతాయి. ప్రభుత్వ కళాశాలల్లో ఆర్ట్‌ ఫెస్టివల్‌ నిర్వహించడానికి తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

మోసం కేసులో ఒకరి అరెస్టు

తిరువళ్లూరు: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదా యం వస్తుందని నమ్మిం చి 68 లక్షల రూపాయలను మోసం చేసిన వ్యక్తిని పోలీసు లు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌ కపిలన్‌నగర్‌కు చెందిన రాజేష్‌. ఇతని భార్య అభిరామి. రాజేష్‌ ఒరగడంలోని ప్రైవేటు టైర్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇదే కంపెనీలో కాంచీపురం జిల్లా సాలమంగళం గ్రామానికి చెందిన విఘ్నేష్‌ సైతం పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభం వస్తుందని నమ్మించి రాజేష్‌తో సుమారు 68 లక్షల రూపాయల మేరకు పెట్టుబడి పెట్టించారు. అయితే రెండు నెలల పాటు నెలకు 80 వేల రూపాయల చొప్పున వడ్డీ ఇచ్చిన విఘ్నేష్‌ తరువాత మానేశాడు. ఇదే విషయంపై రాజేష్‌ నిలదీయగా, విఘ్నేష్‌ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు తిరువళ్లూరు ఎస్పీ వివేకానందశుక్లాకు ఫిర్యాదు చేశా రు. కేసు నమోదు చేసిన పోలీసులు మోసాలకు విఘ్నేష్‌ పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.47 కోట్లు

తిరుత్తణి: తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 26 రోజుల వ్యవధిలో భక్తులు హుండీ కానుకగా రూ.1.47 కోట్లు అందించినట్లు ఆలయ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకునే భక్తులు తమ మొక్కులు చెల్లించే విధంగా కొండ ఆలయంలోని హుండీల్లో నగలు, నగదు వస్తువులు కానుకగా చెల్లిస్తారు. భక్తులు చెల్లించిన కానుకలు ప్రతినెలా లెక్కించడం పరిపాటి. చివరగా 26 రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకల హుండీలను ఆలయ జాయింట్‌ కమిషనర్‌ రమణి సమక్షంలో తెరిచి కానుకల లెక్కింపు సోమవారం నిర్వహించారు. కొండ ఆలయంలోని వసంత మండపంలో నిర్వహించిన కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది వంద మంది పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన కానుకల లెక్కింపులో నగదుగా రూ.1.47 కోట్లు, 732 గ్రాముల బంగారం, 16,330 గ్రాముల వెండి భక్తులు చెల్లించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని బ్యాంకు ఆలయ ఖాతాల్లో జమ చేసినట్లు జేసీ రమణి తెలిపారు.

­­­సబ్‌వే పనులు త్వరగా

పూర్తి చేయాలని డిమాండ్‌

తిరువొత్తియూరు: తిరువొత్తియూరులో రైల్వే సబ్‌వే పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. తిరువొత్తియూరు సంక్షేమ సంఘం సభ్యుల సమావేశం జనరల్‌ సెక్రటరీ సుబ్రమణియన్‌ అధ్యక్షతన, కోశాధికారి మతియళగన్‌ సమక్షంలో జరిగింది. వైస్‌ ప్రెసిడెంట్‌ కోదండం స్వాగతోపన్యాసం చేశారు. సమావేశంలో తిరువొత్తియూరు గ్రామంలోని రైల్వే సబ్‌వే పనులు చాలా కాలంగా నిలిచిపోయాయని, అదేవిధంగా విమ్‌కో నగర్‌ రైల్వే అండర్‌పాస్‌ పనులు కూడా చాలా కాలంగా జరుగుతున్నాయని తెలిపారు. దీని వల్ల పశ్చిమ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు రైల్వే అండర్‌పాస్‌ పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కుమార్‌ సత్యమూర్తి, న్యాయవాది కుమార్‌ భాస్కరన్‌ పాల్గొన్నారు.

అరెస్టయిన విఘ్నేష్‌

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement