
అన్బు కరంగల్ పథకానికి 177 మంది ఎంపిక
వేలూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్బు కరంగంల్ పథకం కింద మొదటి విడతగా జిల్లాలో 177 మంది బాలికలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేటు కళ్యాణ పండంలో ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకాన్ని నిరుపేద కుటుంబంలో జన్మించి తల్లి, దండ్రులు లేకుండా బంధువుల సంరక్షణలో పెరుగుతున్న బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు. అటువంటి వారికి ప్రతి నెలా రూ: 2 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, మాజీ ఎంపీ మహ్మద్‌సఖీ, జిల్లా బాలికా సంరక్షణ అధికారి సంజిత్ తదితరులు పాల్గొన్నారు.