
కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
వేలూరు: వేలూరు కలెక్టరేట్‌లో మహిళ పెట్రోల్ క్యాన్‌తో వచ్చి కలెక్టర్ ముందు ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో ప్రజా విన్నపాల దినోత్సవ కార్యక్రమం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఆ సమయంలో కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు నడిచి వస్తున్న సమయంలో ఆమెను చూసిన వేలూరు శలవన్‌పేటకు చెందిన గుణసుందరి ఆమె బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్‌ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీటిని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకొని విచారణ జరిపారు. ఆ సమయంలో కలెక్టర్ విచారణ జరపగా తన భర్త గత నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందారని అయితే తన ఇంటిని స్వాహా చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన ఓ రౌడీతో పాటు 10 రోజూ సాయంత్రం వేళ తమపై దాడికి దిగుతున్నాడని వీటిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతోనే తాను కలెక్టరేట్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. వీటిపై కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.