
జీవితం ధర్మబద్ధంగా ఉండాలి
వేలూరు: మన జీవితం అనేది ధర్మంగా ఉండాలని కంచి శంకరాచ్చారియార్ విజయేంద్ర సరస్వతి స్వామిజీ అన్నారు. తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులో వేద ఆగమ దేవార భక్తి సంప్రదాయ మహానాడు శని, ఆదివారాల్లో జరిగింది. ఇందులో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో పనిచేస్తున్న 1008 శివాచార్యులు తిరువణ్ణామలై చేరుకొని లోక క్షేమం కోసం ప్రత్యేక యాగ పూజలు చేయడంతో పాటు పూజలు, వేద మంత్రాలు చదివి ప్రార్థనలు జరిపారు. ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ఇందులో కంచి కామకోటి పీఠాధిపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆలయాల్లో దేవతలను రప్పించేందుకు గంటను కొడుతుంటామని అయితే వేదం అనేందుకు మేదావి అని అర్థం. హింధువులు సనాతన ధర్మాన్ని పాటిస్తారన్నారు. వేదం ద్వారా నడుచుకుంటున్నారని అయితే తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. మన జీవితంలో వ్యాపారంలో ధర్మం ఉండవచ్చునని అయితే ధర్మంలో వ్యాపారం ఉండరాదని వేదం చెపుతుందన్నారు. స్థిరంగా, మంచిగాను మనం భూలోకంపై జీవించి మన చుట్టూ ఉన్నవారిని మన బందువులను మంచిగా జీవించే విధంగా చూడాలన్నారు. అన్ని జీవి రాసులకు ప్రాణహాని లేకుండా చేయడమే హిందూ మతం యొక్క ధర్మమన్నారు. సమాజ అభివృద్ధికి మనం సహకరించాలన్నారు. అదే విదంగా మనతో పాటూ మన చుట్టూ ఉన్న వారిని మంచి అలవాట్లు నేర్పించడంతో పాటు ధర్మం చేయడం, నిరుపేదలుకు సాయం చేయడం వంటి వాటిని అలవాటు చేయాలన్నారు. ఈ కామహానాడు ఏర్పాట్లును ఆర్గనైజర్‌లు పీడీ రమేష్ గురుకుల్, పారిశ్రామిక వేత్త జగదీష్, పీడీఆర్ గోకుల్ గురుకుల్, ప్రకాష్, గాఽందీ, కలవై సచ్చిదానం స్వామిజీ, వివిధ ప్రాంతాలకు చెందిన శివాచార్యులు, సాదువులు, వేద పండితులు పాల్గొన్నారు.

జీవితం ధర్మబద్ధంగా ఉండాలి