క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 16 2025 7:27 AM | Updated on Sep 16 2025 7:27 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

ప్రియురాలి వీడియోను సెల్‌ ఫోన్‌కు పంపిన భర్త ● ఆవేదనతో భార్య మృతి రాతి స్తంభం పడి.. ● నాలుగేళ్ల బాలిక మృతి విజయకాంత్‌తో ఎవరినీ పోల్చలేం.. ● డీఎండికే ప్రధాన కార్యదర్శి ఛాంపియన్‌కు అభినందనలు 56 సవర్ల నగలు చోరీ

అన్నానగర్‌: ఈరోడ్‌ జిల్లాలోని గోపిచెట్టిపాళయం ప్రాంతానికి చెందిన సెంథిల్‌. అతని కుమార్తె కీర్తి మీనా(21). ఆమె తిరుప్పూర్‌కు చెందిన శివకుమార్‌ ను ప్రేమించి 4 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. తదనంతరం, శివకుమార్‌–కీర్తి మీనా దంపతులు తిరుప్పూర్‌ లోని ఇడువంపాళయంలోని శివశక్తి నగర్‌ 2వ రోడ్డు లో నివసించారు. వీరికి 2 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ స్థితిలో, శివకుమార్‌ మరొక మహిళతో సంబంధం కలిగి ఉన్నాడు. కీర్తి మీనా ఈ విషయంపై శివకుమార్‌ను ప్రశ్నించింది. తర్వాత ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ స్థితిలో కీర్తి శివకుమార్‌ వివాహేతర ప్రియురాలితో సరదాగా గడుపుతున్న వీడియోను మీనా సెల్‌ఫోన్‌ కు పంపాడు. ఆ వీడియో చూసి షాక్‌ అయిన కీర్తి మీనా తన బిడ్డను ఇంట్లో వదిలి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో వీరపాండి పోలీసులు శివకుమార్‌ను విచారిస్తున్నారు.

అన్నానగర్‌: తేని జిల్లాలోని ఆండిపట్టి సమీపం షణ్ముగసుందరపురం తూర్పు వీధిలో నివసిస్తున్న గోపాల్‌ (32 ). ఇతనికి భార్య అన్నలక్ష్మి, అజిత (4) అనే బిడ్డ ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటారు. ఆదివారం గోపాల్‌, ఇతని భార్య తమ కుమార్తె ను సమీపంలోని వారి సోదరుడు వేలుచామి ఇంట్లో వదిలి పనికి వెళ్లారు. అజిత రెండు రాతి స్తంభాల మధ్య బట్టల దారం కట్టుకుని ఆడుకుంటోంది. అకస్మాత్తుగా, రాతి స్తంభాలలో ఒకటి కూలి పడి బాలికపై పడింది. బాలిక తల, చెవుల నుండి రక్తం కారుతు ఆమె అరుస్తూ, కొట్టుకుంటోంది. వెంటనే సమీపంలో వారి సహాయంతో, బాలికను రక్షించి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలో బాలిక మరణించింది. గోపాల్‌ ఆండిపట్టి పోలీస్‌ స్టేషనన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమలత

కొరుక్కుపేట: విజయకాంత్‌తో ఎవ్వరినీ పోల్చకూడదని డీఎండికే ప్రదాన కార్యదర్శి ప్రేమలత అన్నారు . అన్నాదురై జయంతి సందర్భంగా, ప్రేమలత తిరుచ్చిలోని చింతామణి సమీపంలోని అన్నా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత ఆమె విలేకర్లతో మాట్లాడారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండికే అనే మూడు పార్టీలకు మాత్రమే బూత్‌ కమిటీలు ఉన్నాయి. అగ్రశ్రేణి తారల కోసం ప్రజలు గుమిగూడడం సాధారణం అని పేర్కొన్నారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి తక్కువ కాలంలోనే అత్యధిక ఓట్ల శాతం పొందిన వ్యక్తి విజయకాంత్‌ అని అభిప్రాయపడ్డారు. ఆయనతో మరెవరినీ పోల్చకూడదని అన్నారు.

కొరుక్కుపేట: చైన్నె రైఫిల్‌ క్లబ్‌ సభ్యులైన అంత్రా రాజశేఖర్‌ ఇటీవల కజకిస్తాన్‌న్‌లోని షిమ్‌కెంట్‌లో జరిగిన ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ సత్తాచాటారు. భారత జట్టు తరుపున పాల్గొని ఆమె బంగారు పతకంతోపాటూ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుని భారత్‌ జెండా రెపరెపలాడేలా చేశారు. దీంతో ఆసియా స్థాయి షూటింగ్‌ పోటీలో పతకం గెలుచుకున్న చైన్నె రైఫిల్‌ క్లబ్‌లో మొదటి సభ్యులు కావడం విశేషం, ఇప్పటివరకు ఏ సభ్యుడు పతకం సాధించలేదు. దీనికి ప్రశంసగా చైన్నెలోని గురునానక్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ చైన్నె అదనపు పోలీసు కమిషనర్‌ బి. కన్నన్‌ పాల్గొని అంత్రారాజశేఖర్‌ ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేసి సర్టిఫికెట్‌ అందజేశారు.

తిరువొత్తియూరు: సేలం సూరమంగళంలో ప్రభుత్వ అధికారి దంపతుల ఇంట్లో 56 సవర్లు నగలు చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సేలం సూరమంగళం సమీపంలోని నరసోతిపట్టి ఎన్‌.కె.ఎన్‌ నగర్‌కు చెందిన శివకుమార్‌ (58). ఇతను సేలం 5 రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయంలో అధికారిగా పనిచేస్తున్నారు. ఇతని భార్య మణిమేఖల దేవి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులుగా నామక్కల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరి ఇంటిలోకి గత 11వ తేదీన చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు 56 సవర్లు నగలు బంగారునగలు రూ.95 వేల నగదు, చోరీ చేశారు. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా సీసీటీవీలో రికార్డయిన ఆ వ్యక్తి కృష్ణగిరి జిల్లాకు చెందిన ధర్మరాజ్‌ అలియాస్‌ ధర్మన్‌ (45) అని తెలిసింది. దీంతో సూరమంగళం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ధర్మన్‌ నుంచి 42 సవర్లు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మాన్‌ను సోమవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement