
సోషియో ఫాంటసీ చిత్రంగా గాడ్స్ జిల్లా
తమిళసినిమా: ఇటీవల సరండర్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు దర్శన్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం సోమవారం ఉదయం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. గాడ్స్ జిల్లా పేరుతో తెరకెక్కుతున్న ఇందులో దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. నటి అలీషా మరాణి కథానాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సినిమా మీడియా అండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ లిమిటెడ్ సంస్థ అధినేత ధినేశ్‌రాజ్ సమర్పణలో క్రియేటీవ్ ఎంటర్‌టెనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ, పీజీఎస్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి మోహన్ గురుసెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్.ధాను, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి, దర్శకుడు శశి, పాండిరాజ్ తదితర సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సోషియో ఫాంటసీ నేపధ్యంలో సాగే వినోదభరిత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఈ తరం యువతను ప్రతిబించే విధంగా పురాణాల కల్పిత కథాంశంతో అన్ని వర్గాలను అలరించే కుటుంబ కథా చిత్రంగా గాడ్స్ జిల్లా ఉంటుందని చెప్పారు. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. నటుడు రోబో శంకర్, కేపీవై వినోద్,బ్లాక్ పాండి, పీజీఎస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివరాజ్ ఛాయాగ్రహణం, ఆనంద్ సంగీతాన్ని అందిస్తున్నారు.