
సంగీతంతో మానసికోల్లాసం
కొరుక్కుపేట: సంగీతంతో మానసికోల్లాసం లభిస్తుందని తెలుగు భాషాభిమాని, సేవా రత్న శోభారాజా పేర్కొన్నారు. కళారంజని ఫౌండేషన్, శ్రీ కళా రంజని మ్యూజిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తి రంజని పేరిట శనివారం రాత్రి భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. చైన్నె వెస్ట్‌మాంబలం లోని అయోధ్య మండపం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ జె. శ్రీనిబాబు అధ్యతన వహించారు. మణిమాల రావు, వసంతరాణి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి అతిథులుగా కలైమామణి డాక్టర్ జె. సుబ్రమణ్యం, తెలుగుభాషాభిమాని సేవారత్నా శోభారాజా , జ్ఞాన సరస్వతి శాంతి సురేష్ , సమాజ సేవకులు వైజీ మధువంతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ శ్రీనిబాబు సారథ్యంలో రాగమాలిక లో 21 రాగాలతో 108 మంది సంగీత విద్యార్థులు లలితా సహస్రనామాన్ని శ్రావ్యంగా ఆలపించి ఆథ్యంతం వీనులవిందు చేశారు. అంతకుముందు విల్లివాక్కం సుష్మా ప్రసాద్ పాల్గొని శ్రీలలితాంబికాదేవిని స్తుతిస్తూ భక్తి కథ గానం తో ఆకట్టుకున్నారు . ఈ కార్యక్రమంలో సంగీత విద్యార్థులు, తెలుగు తరుణి మహిళా సభ్యులు పాల్గొన్నారు.