
19న తెరపైకి దండకారణ్యం
తమిళసినిమా: దర్శకుడు పా.రంజిత్ కు చెందిన నీలం ప్రొడక్షనన్స్, ఎస్.సాయి దేవానంద్‌కు చెందిన లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షనన్స్ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రం దండకారణ్యం. అదిరన్ ఆధిరై కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో దినేష్, కలైయరసన్, విన్సు, రితిక హీరో హీరోయిన్లుగా నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని , ప్రదీప్ దురై ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన తెరపైకి రానుంది ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం చైన్నెలోని ఓ హోటల్ నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు అదియన్ ఆధిరై మాట్లాడుతూ కౌరవ సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు చీరను ఇచ్చి కాపాడే వరకు పాండవులు ఏం చేశారన్నదే దండకారణ్యం కథాంశం అని చెప్పారు. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథా చిత్రం అయిన ప్రేమ, మనోభావాలు, ఉద్రేకాలు కలిగిన కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నటీనటులు, సాంకేతిక వర్గం పూర్తి సహకారం అందించారు నీ, ముఖంగా నటుడు కలైయరసన్ సహకారం మరువలేనిది అన్నారు. ఈ చిత్రంలో ఆయన నటన ప్రశంసలు పొందుతుందని చెప్పారు. నా.రంజిత్ మాట్లాడుతూ తాను నీలం ప్రొడక్షనన్స్ సంస్థతో కలిసి చాలా తక్కువ మందే పని చేస్తారన్నారు. అలా తాజాగా లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షనన్స్ అధినేత సాయి దేవానంద్ తమతో కలిసి చేయడానికి వచ్చారని చెప్పారు. తాను దర్శకుడిగా మూడు సంవత్సరాలు మాత్రమే చేయాలని భావించానన్నారు. ఎందుకంటే తన భావాలు, తన రాజకీయాలు లేరన్నారు. అలాంటిది నీలం ప్రొడక్షన్స్ చాలా మందిని తయారు చేయడంతోనే తాను ఇంత కాలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ నిలబడటానికి కారణం అన్నారు. దండకారణ్యం చిత్రాన్ని దర్శకుడు అదియన్ ఆధిరై చాలా కొత్తగా తెరపై ఆవిష్కరించారని పొ.రంజిత్ పేర్కొన్నారు. తాము కార్పొరేట్ కంపెనీలను నమ్మి కాకుండా ప్రేక్షకులను నమ్మి చిత్రాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
దండకారుణ్యం చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించిన నా. రంజిత్‌తో యూనిట్ సభ్యులు