కుంకీ –2
చిత్ర ఫస్ట్‌లుక్
పోస్టర్
తమిళసినిమా: కథ ఏదైనా ప్రేక్షకుల మనసులను హత్తుకున్నప్పుడే అది విజయవంతమైన చిత్రంగా మారుతుంది. అలాంటి చిత్రాలలో కుంకి ఒకటి ప్రభు సాలమన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ద్వారా నటుడు విక్రమ్ ప్రభు కథానాయకుడిగా పరిచయమయ్యారు. 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు కుంకీకి సీక్వెల్ తెరకెక్కింది. ప్రభు సాలమన్ నే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతి లాల్ గడ సమర్పణలో తవల్ గడ నిర్మిస్తున్నారు నటుడు మది కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఇందులో నటుడు అర్జున్ దాస్ కీలక పాత్రను పోషించారు. నటి శ్రిత రావ్, అండ్రూస్, ఆకాష్, హరీష్ పేరడీ, శ్రీనాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నివాస్ కే. ప్రసన్న సంగీతాన్ని ,సుకుమార్ ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కుంకీ– 2 త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఒక పిల్లాడికి గున్న ఏనుగుకు మధ్య అనుబంధమే ఈ చిత్ర కథ అని పేర్కొన్నారు. తమిళ సినీ ప్రపంచంలో ఏనుగు ప్రధాన ఇతి వత్తంగా ప్రభు సాల్మన్ ఇంతకుముందు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం కుంకీ అని దానికి మించిన భావోద్వేకాలు, ప్రేమాభిమానాలతో రూపొందించిన చిత్రం కుంకీ– 2 అని చెప్పారు. ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించిన నటుడు మదికి తగిన గుర్తింపు కచ్చితంగా దక్కుతుందన్నారు. ఇది ప్రకృతి, మనిషి, ఏనుగుల మధ్య అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. కుంకి చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులతో పాటూ ఈ తరం యువతను అలరించే విధంగా కుంకీ– 2 చిత్రం ఉంటుందని చెప్పారు.
కుంకీ 2 రెడీ