
పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులను ప్రోత్సహించాలి
తిరువళ్లూరు: పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులను తయారు చేసే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే రోబోటిక్ ల్యాబ్‌ను ఆర్‌ఎంకే కళాశాలలో ఏర్పాటు చేయడం శుభపరిమాణమని హెచ్‌సీఎల్ గ్లోబల్ డైరెక్టర్ కోటీశ్వరన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే కళాశాలలో రూ.1.50 కోటి వ్యయంతో రోబోటిక్, కాగ్నిటీవ్–ఏ1 ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన క్రమంలో ల్యాబ్‌ను ప్రారంభించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కళాశాల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌ఎస్ మునిరత్నం, కోటీశ్వరన్ హాజరై ల్యాబ్‌ను ప్రారంభించారు. హెచ్‌సీఎల్ డిప్యూటీ జీఎం జ్యోతిచౌదరి, వైస్ చైర్మన్ ఆర్‌ఎం కిషోర్, కార్యదర్శి యలమంచి ప్రదీప్, సలహాదారుడు పళనిస్వామి, ప్రిన్సిపల్ మహ్మద్‌జునైత్, డీన్ శివజ్ఞానప్రభు పాల్గొన్నారు.