
లోక్ అదాలత్‌లో 4,436 కేసులు పరిష్కారం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న కోర్టుల్లో జరిగిన మెగా లోక్ అదాలత్‌లో 4,436 కేసులకు పరిష్కారం లభించినట్టు జిల్లా న్యాయమూర్తి జూలియట్ పుష్ప తెలిపారు. జాతీయ చట్ట పనులు కమిషన్ ఆదేశాల మేరకు తిరువళ్లూరు, పూందమల్లి, పొన్నేరి, తిరుత్తణి, అంబత్తూరు, తిరువొత్తియూర్, పళ్లిపట్టు, ఊత్తుకోట, గుమ్మిడిపూండి, మాధవరం ప్రాంతాల్లోని కోర్టు ఆవరణలో మెగాలోక్ అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా తిరువళ్లూరు జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన అదాలత్‌ను జిల్లా న్యాయమూర్తి జూలియట్ పుష్ప ప్రారంభించారు. లోక్‌అదాలత్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న కేసులపై ఇరువర్గాలను పిలిపించి పరిష్కార మార్గాలను చూపారు. జిల్లాలో మొత్తం 8,404 కేసులు పెండింగ్‌లో వుండగా, వీటిలో 4,436 కేసులకు పరిష్కారం చూపి రూ.22.78 కోట్లు రూపాయలకు చెక్కులను అందజేశారు. న్యాయమూర్తులు మీనాక్షి, కలైపొన్ని, దీనదయాళన్, సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో 291 కేసుల పరిష్కారం
10 మంది జూదరుల అరెస్టు
అన్నానగర్: ముందస్తు సమాచారం మేరకు శనివారం తిరువల్లికేని హైవేలోని ఓ గెస్ట్‌హౌస్‌లోని గదిని పర్యవేక్షించారు. కొంతమంది డబ్బు డిపాజిట్ చేస్తూ కార్డులతో జూదం ఆడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో నిందితులు నాగముత్తు (40), సుధీర్ బాబు (33), జయప్రకాష్ (40), బలరామ కష్ణమూర్తి (30), శ్రీ వి.కె. నగర్ కు చెందిన వేదగిగి(47), రాజేంద్ర ప్రసాద్ (48), రాయపేటకు ప్రాతినిధ్యం వహించిన వినోద్ (40), అళ్వార్‌పేటకు చెందిన పెరోష్ ఖాన్ (50), మురుగన్ (42), ఆంటోనీ (25)లను అరెస్టు చేశారు.వారి నుంచి రూ.30 వేలు, జూదం ఆడటానికి ఉపయోగించే 9 ప్యాక్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
గాయపడిన బాలుడి మృతి
అన్నానగర్: మిద్దె పైనుంచి పడి గాయపడిన ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. చైన్నె, వలసరవాక్కమ్ అన్బునగర్ 9వ వీధిలోని ఓ భవనంలో మొదటి అంతస్తులో ఆనందన్ నివసిస్తున్నాడు. ఇతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడు సర్వేశ్వరన్(1). 9వ తేదీ సాయంత్రం, ఆనందన్ భార్య స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడిని తీసుకురావడానికి కిందికి వెళ్లింది. ఆ సమయంలో మొదటి అంతస్తులోని బాల్కనీలో ఆడుకుంటున్న సర్వేశ్వరన్ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడ్డాడు. ఇది చూసి ఇరుగుపొరుగు తీవ్రంగా గాయపడిన సర్వేశ్వరన్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఎగ్మూర్ చిల్డ్రన్‌న్స్ హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. కోయంబేడు పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
విషజ్వరంతో చిన్నారి మృతి
తిరువళ్లూరు: విష జ్వరంతో ఆరు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెళ్లియూర్ భారతీయార్ నగర్‌కు చెందిన త్యాగరాజన్ ఆనంది దంపతులకు జ్యోతిక శ్రీ అనే ఆరు నెలల చిన్నారి వుంది. ఈ గ్రామంలో గత కొద్ది రోజులుగా విషజ్వరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈక్రమంలో చిన్నారి విషజ్వరం బారినపడింది. దీంతో వెళ్లియూర్‌లోని ప్రభుత్వ వైద్యశాలలో చిక్సితకు తీసుకెళ్లగా అక్కడ డాక్టర్‌లుమందులిచ్చారు. దీంతో ఆనంది చిన్నారికి మందు ఇచ్చి పడుకోబెట్టింది. అయితే ఆదివారం ఉదయం చిన్నారి పడకలోనే మృతి చెందినట్లు వాపోయింది.
వేలూరు: రాణిపేటలోని ఉమ్మడి కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ జిల్లా న్యాయమూర్తి మునస్వామి అధ్యక్షతన ఆదివారం ఉదయం జరిగింది. ఇందులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెరుంగులంజి గ్రామానికి చెందిన హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు, అరుంగుండ్రం గ్రామానికి చెందిన ఏయుమలై కుటుంబ సభ్యులు నష్ట పరిహారం కోరుతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన న్యాయమూర్తులు హరిహరన్ కుటుంబ సభ్యులకు రూ.30 లక్షలు, ఏయుమలై కుటుంబ సభ్యులకు రూ.70 లక్షలు నష్ట పరిహారాన్ని ప్రైవేటు ఇన్సురెన్స్ కంపెనీలు చెల్లించాలని న్యాయమూర్తులు తీర్పు నిచ్చారు. అదే విధంగా పలు భూ సమస్యలతో పాటూ పలు రోడ్డు ప్రమాదాలు, కేసులకు సంబంధించి న్యాయ మూర్తుల సమక్షంలో న్యాయవాదులు ఇరు వర్గాల వారితో చర్చించి కేసులను రాజీ చేశారు. ప్రజా కోర్టులో మొత్తం 291 కేసులకు సంబందించి రూ: 4 కోట్ల 38 లక్షల 36,882 నగదు చెక్కును నష్ట పరిహారంగా చెల్లించారు. అదేవిధంగా వేలూరు, తిరుపత్తూరు జిల్లాలోని ఉమ్మడి కోర్టులోను లోక్ అదాలత్‌లు నిర్వహించి పలు కేసులకు పరిష్కార మార్గం చూపారు. ఇందులో న్యాయ మూర్తులతో పాటూ న్యాయవాదులు, పిటిషన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది.

లోక్ అదాలత్‌లో 4,436 కేసులు పరిష్కారం