
కోలాహలం..వాసవీ క్రికెట్ టోర్నమెంట్
కొరుక్కుపేట: వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చైన్నె పెరంబూరులోని హాట్‌ఫుట్ ఎస్‌ఆర్పీ స్పోర్ట్స్ గ్రౌండ్ వేదికగా వాసవీ ప్రీమియర్ లీగ్ టీ7 క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం కోలాహలంగా నిర్వహించారు. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ కోశాధికారి, ప్రాజెక్టు చైర్మన్ సుజాత రమేష్‌బాబు నేతృత్వంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌కు వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈ.రామకృష్ణ, అర్జున అవార్డు గ్రహీత, ఒలింపియన్ వి.దేవరాజన్ పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. టోర్నమెంట్‌లో వివిధ రాష్ట్రాల నుంచి 13 జట్లు పాల్గొన్నాయి. ఈసందర్భంగా నిర్వాహకులను అభినందించారు. వాసవీక్లబ్ వీ502ఏ గవర్నర్ సీఎం రాజేష్, వాసవీ క్లబ్ నిర్వాహకులు పాల్గొన్నారు.