
డీఎంకేలో చేరిన యువత
పళ్లిపట్టు: డీఎంకే తీర్థం పుచ్చుకున్న యువతీయువకులకు ఎమ్మెల్యే చంద్రన్ ఘనస్వాగతం పలికారు. పళ్లిపట్టు నార్త్ మండల డీఎంకే కార్యదర్శి న్యాయవాది సీజే.శ్రీనివాసన్ సమక్షంలోని మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పళ్లిపట్టు టౌన్‌కు చెందిన బీవీకే పార్టీ శ్రేణులతోపాటు యువతీ, యువకులు వంద మంది డీఎంకేలో చేరారు.ఈ కార్యక్రమం మండల డీఎంకే కార్యాలయంలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో తిరువ ళ్లూరు వెస్ట్ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన యువతీ, యువకులను పార్టీలోకి ఆహ్వానించారు. డీఎంకే సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు మెచ్చిన యువత పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి కార్యకర్త తమ వంతుగా పార్టీలో కొత్త వారిని చేర్పించి ఎన్నికల్లో విజయానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పట్టణ కార్యదర్శి సెంథిల్‌కుమార్, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు.