
వైభవం.. మహాకుంభాభిషేకం
కొరుక్కుపేట: బాలాజీ భక్త జనసభ ఆధ్వర్యంలో చైన్నె శివారు ప్రాంతం పెరియపాళయం పనపాక్కంలోని శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వర పెరుమాళ ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ట్రస్టీలు ఊసూరు నందకుమార్, ఎం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం హోమ పూజలు, పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు.అనంతరం ఉద యం ఆలయం గోపురంపై పవిత్ర జలాలను పోసి కుంభాభిషేక మహోత్సవాన్ని వైభవంగా చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కుంభాభిషేకాన్ని తిలకించి తరించారు. అర్చకులు భక్తులపై పవిత్ర జాలాలు చల్లగా పరవశించిపోయారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. గోవింద నామస్మరణలతో ఆలయం ప్రాంగణం మార్మోగింది.