
శుభమస్తు..!
32 జంటలకు వివాహాలు.
మణిపూర్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుందర్
సాక్షి, చైన్నె: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎం సుందర్‌ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన సోమశేఖర్ పదవీ విరమణ పొందారు. ఈ దృష్ట్యా, ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ జస్టిస్ ఎం. సుందర్‌ను నియమించారు. జస్టిస్ ఎం. సుందర్ చైన్నెకు చెందిన వారు. ఇక్కడి మద్రాసు న్యాయ కళాశాలలో న్యాయ శాస్త్రం చదివారు. 1989లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ వచ్చిన ఆయనకు ప్రస్తుతం పదోన్నతి దక్కింది. ఆయన అనేక కీలక కేసులలో సంచనలనాత్మక తీర్పులు వెలువరించి గుర్తింపు పొందారు.
సాక్షి, చైన్నె: రాష్ట్ర హిందూ ధర్మాగాయ శాఖ నేతృత్వంలో ఆదివారం 32 జంటలకు వివాహాలు జరిగాయి. అలాగే తిరుచెందూరు , పళణి ఆలయాలలో ఉదయం అనేక వివాహాలు జరిగాయి. చైన్నెలోని రాజా అన్నామలైపురంలోని కపాళ్వీరర్, కర్పకాంబాల్ వివాహ మందిరంలో హిందూ ధర్మాదాయ శాఖ నేతృత్వంలో 32 జంటలను ఎంపికచేసి వివాహాలు అత్యంత వేడుకగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరై వరులకు తాళి బొట్లను అందజేశారు. 32 జంటలకు ఒక్కొక్కరికి 4 గ్రాముల బంగారంతో తాళి అందజేశారు. అలాగే అన్ని రకాల సారెను అందజేశారు. ఈ ఒక్క రోజున 193 జంటలకు రాష్ట్ర వ్యాప్తంగా వివాహాలు దేవాదాయశాఖ తరపున ఆయా ఆలయాలలో నిర్వహించారు. తిరుచెందూరు, పళణి ఆలయాలలోనూ వివాహాల అనంతరం వధువరులకు అన్ని రకాల వస్తువులతో కుటుంబానికి కావాల్సిన వాటిని సారెగా అందజేశారు. చైన్నెలో జరిగిన వేడుకలో ఉదయ నిధి మాట్లాడుతూ, వధువరులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఒక్క సంవత్సరంలో హిందూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ తరపున 1000 వివాహాలు జరిగినట్టు వివరించారు. ఈ సందర్భంగా ప్రేమ వివాహాలను గురించి ప్రస్తావిస్తూ, ప్రేమలో పడ్డ వారి తల్లిదండ్రులను సమత్తంతో వివాహాలు చేసుకోవాలని సూచించారు. సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సంఘాలు, కులాల పేర్లు ఎవ్వరి వెనుక రాదని, చదువుకున్న డిగ్రీలు చిరకాలంగా ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక్కడున్న జంటలు పరస్పరం సర్దుకుపోయే తత్వం అలవాటు చేసుకోవాలని, ఒకర్ని మరొకరు గౌరవిస్తూ ముందుకెళ్లడమే కాదు, పుట్టబోయే పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని కోరారు. ప్రతి వివాహ వేడుకలతో సీఎంతోపాటూ తాను ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎంసుబ్రమణియన్, శేఖర్‌బాబు, మేయర్ ప్రియా, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్, ఎమ్మెల్యే టి. వేలు, కరుణానిధి, హిందూ ధార్మిక శాఖ అదనపు కార్యదర్శి మణివాసన్ పాల్గొన్నారు.