
బ్లాక్‌మెయిల్‌కి పాజిటివ్ టాక్
తమిళసినిమా: నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లాక్ మెయిల్. శ్రీకాంత్, బిందు మాధవి, తేజు, అశ్విని, లింగ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.మారన్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. జేడీఎస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై అమల్‌రాజ్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది దీన్ని జి. ధనుంజయన్‌కు చెందిన క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ సంస్థ తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేసింది. కథ వాస్తవానికి ఈ చిత్రం కావాల్సింది అయితే ఆలస్యంగా విడుదలైన మంచి జరిగిందనే ఆనందాన్ని నిర్మాతల వర్గం వ్యక్తం చేస్తుంది. బ్లాక్‌మెయిల్ చిత్రానికి క్రిటిక్స్ నుంచి సద్వివిమర్శలు రావడంతో పాటూ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రిపోర్ట్ వస్తోందని ఎగ్జిబిటర్లు పేర్కొనడం విశేషం. ఓ ప్రముఖ ఎగ్జిబిటర్ బ్లాక్ మెయిల్ చిత్రం గురించి తన స్పందన వ్యక్తం చేస్తూ బ్లాక్ మెయిల్ చిత్రానికి మొదటి రోజు నుంచి ప్రేక్షకుల రాక అధికం అయిందని పేర్కొన్నారు. ఆసక్తికరమైన కథ, కథనాలు, మనసును కదిలించే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నట్లు ప్రేక్షకులు పేర్కొంటున్నారని చెప్పారు. చిత్రానికి ప్రేక్షకుల రాక అధికం అవుతుండడంతో అధిక షోలను ప్రదర్శించాలని నిర్ణయించినట్లు ఆ ఎగ్జిబిటర్ పేర్కొన్నారు. చిత్తానికి మంచి ఆదరణ లభించడంతో నిర్మాతల వర్గం తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చిత్ర విడుదల ఆలస్యమైన తమకు మంచి జరిగిందనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని నిర్మాత అమల్ రాజు పేర్కొన్నారు.