కాంతారలో ప్రత్యేక పాట కోసం.. | - | Sakshi
Sakshi News home page

కాంతారలో ప్రత్యేక పాట కోసం..

Sep 14 2025 3:09 AM | Updated on Sep 14 2025 3:09 AM

కాంతా

కాంతారలో ప్రత్యేక పాట కోసం..

తమిళసినిమా: కన్నడంలో రూపొందిన కాంతార చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటుడు రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హోమ్‌ బలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆ చిత్రానికి ఫ్రీక్వెన్సీగా కాంతారా చాప్టర్‌– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్లో బ్రహ్మాండంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్‌ చేశారు. ఆ పాటను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్‌ దోసంజ్‌ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కాంతారా వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్‌ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్‌ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్‌ లోకనాథ్‌ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్‌ శెట్టి, గాయకుడు దిల్జిత్‌ దోసంజ్‌, హోమ్‌ బలే ఫిలిమ్స్‌ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్‌ రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.

కాంతారలో ప్రత్యేక పాట కోసం.. 1
1/1

కాంతారలో ప్రత్యేక పాట కోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement