
కిస్ మీ ఇడియట్.. అంటున్న శ్రీలీల
శ్రీలీల
తమిళసినిమా: ఇటీవల పుష్ప– 2 చిత్రంలో కిసక్ కిసక్ అంటూ ప్రత్యేక హోటల్లో నటించి యువతను గిలిగింతలు పెట్టించిన నటి శ్రీలీలను అంత ఈజీగా ఎవరు మర్చిపోరు. అదేవిధంగా త్వరలో శివకార్తికేయన్‌కు జంటగా పరాశక్తి చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలదించడానికి సిద్ధమవుతున్నారు. కాగా అంతకుముందే కిస్ మీ ఇడియట్ అనే చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈమె కన్నడంలో నటించిన రెండవ చిత్రం కిస్‌కు అనువాదం కావడం గమనార్హం. ఇది కన్నడంలో 2019లో విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. విరాట్ కథానాయకుడిగా నటించిన ఇందులో రోబో శంకర్, నాంజిల్ విజయమన్, అస్వతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయశంకర్ రామలింగం ఛాయాగ్రహణం, ప్రకాష్ నిక్కి సంగీతాన్ని అందించారు. కిస్ మీ ఇడియట్ చిత్రం ఈనెల 26వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇది రొమాంటిక్ ప్రేమ కథ చిత్రంగా ఉంటుందన్నారు. కళాశాలలో చదువుకునే శ్రీలీల తన తోటి విద్యార్థులతో కలిసి ఆట పట్టించినందుకు గాను ప్రిన్సిపల్ ఆమెను తరగతి గది నుంచి ఒక రోజు బహిష్కరిస్తారన్నారు. దీంతో కోపంతో బయటికి వచ్చిన ఉక్రోషంతో కళాశాల వెలుపల ప్రిన్సిపల్ ఫొటోతో ఉన్న బ్యానర్‌పై రాయి విసిరితోందన్నారు. ఆ రాయి బ్యానర్‌పై తర్వాత అటుగా వస్తున్న విరాట్ కారుపై పడడం అద్దం పగులుతుందన్నారు. దీంతో శ్రీలీలను విరాట్ నష్టపరిహారంగా రూ.4 లక్షలు డిమాండ్ చేస్తాడన్నాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడన్నారు. అంత డబ్బు తన వద్ద లేదని శ్రీలీల ప్రాధేయ పడితే ఒక ముద్దు ఇవ్వు లేదా తన వద్ద రెండు నెలలు సహాయకురాలిగా పనిచేయమని చెబుతాడన్నారు. దీంతో శ్రీలీల అతని వద్ద రెండు నెలలు సహాయకురాలుగా పనిచేయడానికి అంగీకరిస్తుందన్నారు. అలా శ్రీలీల విరాట్ పై ప్రేమను పెంచుకున్న తరుణంలో గడువు పూర్తి కావడంతో ఆమెను పని నుంచి తొలగిస్తాడన్నారు. ఆ తర్వాత ఆమె లేకుండా తాను ఉండలేనన్న భావన విరాట్‌కు కలుగుతుందన్నారు. అలాంటి వారి ప్రేమ ఫలించిందా ? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం కిస్ మీ ఇడియట్ అని దర్శకుడు చెప్పారు.