
చోరీ సెల్‌ఫోన్‌లు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు
వేలూరు: చోరీ చేసిన సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేసినా, విక్రయించిన సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మయిల్‌వాగనం అన్నారు. వేలూరు జిల్లా వ్యాప్తంగా సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్న యజమానులకు సెల్‌ఫోన్‌లు అప్పగించే కార్యక్రమం ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సీఈఐఆర్ వంటి పోర్ట్‌ల్ ద్వారా గుర్తించిన సుమారు రూ. 50 లక్షల విలువ చేసే మొత్తం 250 సెల్‌ఫోన్‌లను వాటి యజమానులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇది వరకే తొమ్మిది విడతలుగా సెల్‌ఫోన్‌లను గుర్తించి వాటి యజమానులకు అప్పగించామన్నారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 38 లక్షల 94,400 విలువ చేసే సెల్‌ఫోన్‌లను కనిపెట్టడం జరిగిందన్నారు. చోరీ చేసిన సెల్‌ఫోన్‌లను సెల్‌ఫోన్ దుకాణదారులు కొనుగోలు చేస్తున్నారని, ఇకపై చోరీ సెల్‌ఫోన్లను కొన్నా, విక్రయించినా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్‌లు చోరీ జరగడం కొంత వరకు తగ్గిందన్నారు. ఇటీవల కాలంలో అధికంగా సెల్‌ఫోన్‌లో బ్యాంకు ఎటీఎం, ఆధార్ కార్డు, ఫొటో వంటి వాటి ఫొట్లోను భద్రపరుచుకుంటున్నారని, దీంతోసెల్‌ఫోన్ చోరీ చేసిన వారు సులభంగా బాధితుల బ్యాంక్ ఖాతాను కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీటిపై యజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం యజమానులకు సెల్‌ఫోన్‌లను అప్పగించారు. ఆయనతో పాటూ అదనపు ఎస్పీలు అన్నాదురై, భాస్కరన్, ఇన్‌స్పెస్పెక్టర్ రజనీకాంత్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్, మలర్ తదితరులున్నారు.