
ప్రభుత్వ బస్సు అద్దాలు ధ్వంసం
తిరుత్తణి: ప్రభుత్వ బస్సు కండెక్టర్‌పై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన ఘటనకు సంబందించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి పోలీసుల కథనం మేరకు.. పొదటూరుపేట ప్రభుత్వ బస్సు డిపోకు చెందిన రూట్ నెంబర్ 27బి టౌన్‌బస్సు శనివారం సాయత్రం 5.10 గంటలకు తిరుత్తణి బస్టాండు నుంచి మహాన్ కాలికాపురానికి బయల్దేరింది. బస్సు డ్రైవర్‌గా పద్మనాభన్, తాత్కాలిక కండెక్టర్‌గా నరేష్ విధులు నిర్వహించారు. బస్సులో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా వుండడంతో పాటూ విద్యార్థులు సైతం ప్రయాణం చేశారు. కొంతమంది విద్యార్ధులు పుట్‌బోర్డులో వేలాడుతూ.. కంబీలు పట్టికుని ప్రమాదకరంగా ప్రయాణం పట్ల కండెక్టర్ విద్యార్థులను లోపలికి రావాలని హెచ్చరించడంతో వారు కండెక్టర్‌తో గొడవకు దిగి దాడిచేసి బస్సు నుంచి దిగి వెళ్లిపోయారు. కొంత సేపటికి బైకుపై బస్సును వెంబడించి వెనుక వైపు అద్దాలు ధ్వంసం చేసి పరారయ్యారు. ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మరో బస్సులో ప్రయాణికులను పంపించి కండెక్టర్‌పై దాడిచేసి అద్దాలు ధ్వంసం చేసిన విద్యార్థులకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.