
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా వీరపాండియన్
సాక్షి, చైన్నె : రాష్ట్ర సీపీఐ కార్యదర్శి ఎం వీరపాండియన్ నియమితులయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ముత్తరసన్ వ్యవహరిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదవీ కాలం ముగియడంతో కొత్త కార్యదర్శి ఎంపిక శనివారం జరిగింది. చైన్నె చూలైమేడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ రాజా, జాతీయ కార్యదర్శులు కె నారాయణ, అనిరాజా, ముత్తరసన్‌తో పాటుగా 110 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో కామేడ్ర్ ఎం. వీర పాండియన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఇది వరకు ఆయన డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరించే వారు. 40 సంవత్సరాలు ఆయన సీపీఐకు సేవలు అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు. వీర పాండియన్‌రాష్ట్ర కార్యదర్శిగానే ఎన్. పెరియ స్వామి, టీఎం మూర్తి, పి పద్మావతి, కె శాంతనం, వహిద నిజాం, శివపుణ్యం, ఎం రవి, రామస్వామి, ఆర్ముగం, కన్నగి, రవీంద్రనాఽథ్, సెల్వరాజ్, టీ రామచంద్రన్, తదితర 31 మంది రాష్ట్ర కార్యనిర్వహఖ కమిటీని నియమించారు. ఈసందర్భంగా కొత్త కార్యదర్శికి డీఎంకే అధ్యక్షుడు , సీఎం స్టాలిన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగంతో పాటుగా డీఎంకే కూటమి పార్టీల నేతలు శంభాకాంక్షలు తెలియజేశారు.