ఇంటి స్థలాలు కేటాయించాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

ఇంటి స్థలాలు కేటాయించాలని నిరసన

Sep 14 2025 3:09 AM | Updated on Sep 14 2025 3:09 AM

ఇంటి

ఇంటి స్థలాలు కేటాయించాలని నిరసన

సేలం: జూలై 10న నామక్కల్‌ జిల్లాలోని వరుకూరం పట్టి ప్రాంతంలో 33 మంది ట్రాన్స్‌జెండర్‌ మహిళలకు నివాస స్థలాలను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో వారు శనివారం స్థలాన్ని సందర్శించడానికి వెళ్లిన ట్రాన్స్‌జెండర్‌ మహిళలను గ్రామస్తులు ఆపి, భూమికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వారు తమ ఉత్పత్తులను ఎండబెట్టడానికి, మేకలు, పశువులను మేపడానికి, వ్యవసాయ అవసరాలకు భూమిని ఉపయోగిస్తున్నారని, ఆ భూమిని ట్రాన్స్‌జెండర్‌ మహిళలకు ఇవ్వకూడదని నినాదాలు చేశారు. నల్ల జెండాలు ఊపి నిరసన తెలిపారు. ఈ నిరసన కారణంగా ఆ ప్రాంతంలో దాదాపు మూడు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయనా రెవెన్యూ శాఖ సర్వేయర్లు తమ సర్వే పనులను పూర్తి చేయడం గమనార్హం.

ఇంటి స్థలాలు కేటాయించాలని నిరసన 1
1/1

ఇంటి స్థలాలు కేటాయించాలని నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement