
లగేజీ వ్యాన్‌ను ఢీకొన్న ప్రభుత్వ బస్సు
వేలూరు: లగేజీ వ్యాన్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా సెంగం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. సెంగం నుంచి తిరువణ్ణామలైకి ప్రభుత్వ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు తిరువణ్ణామలై సమీపంలోని మేల్‌ఆన్‌మలై వద్ద వెళుతుండగా తిరువణ్ణామలై నుంచి బెంగళూరు వెళుతున్న లగేసీ వ్యాన్‌ను అతి వేగంగా డీకొంది. ఈ ప్రమాదంలో మినీ లగేజీ వ్యాన్ డ్రైవర్ మణి(27) అక్కడికక్కడే మృతిచెందాడు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సెంగం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మృతుడు మణి, అతనితో వచ్చిన వారందరూ తిరువణ్ణామలైకి చెందిన వారుగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.