
తిరుత్తణిలో మీతో స్టాలిన్
తిరుత్తణి: తిరుత్తణి మున్సిపల్ పరిధిలోని 20, 21వ వార్డులకు సంబంధించి మీతో స్టాలిన్ పథకం శిబిరం శనివారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 13 శాఖల అధికారులు, 43 రకాల వైద్య సేవలకు సంబంధించి శిబిరం నిర్వహించారు. శిబిరంలో 20, 21 వార్డులకు సంబంధించి స్థానికులు పాల్గొని ఆయా శాఖల అధికారులకు దరఖాస్తులు అందజేశారు. శిబిరంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, వైస్ చైర్మన్ సామిరాజ్ పాల్గొని ప్రారంభించారు. శాఖల వారీగా ఏర్పాట్లను పరిశీలించి, అర్జీలకు సంబంధించిన అర్హులకు ప్రభుత్వ సర్టిపికెట్లు చైర్‌పర్సన్ సరస్వతి అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించిన శిబిరంలో మహిళలకు హక్కు పథకం ద్వారా రూ. వెయ్యి మాసాంతర ఆర్థిక సాయం, ఉచిత ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, రెవెన్యూ సర్టిఫికెట్లు సహా వివిధ సేవలకు సంబంధించి 754 దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.