
రామన్న, అన్బుమణికి పోలీసుల చెక్
సాక్షి, చైన్నె: వివాదాలకు కేంద్రంగా మారిన పీఎంకేలోని రాందాసు, అన్బుమణి రాందాసులకు ఇక చెక్‌పెట్టే దిశగా పోలీసులు వ్యూహాలకు పదును పెట్టారు. ఈ ఇద్దరి వివాదంతో కేడర్‌రెండుగా చీలి ఎక్కడికక్కడ కయ్యానికి కాలుదువ్వుతుండటాన్ని పరిగణించి వీరి నేతృత్వంలో జరిగే వేర్వేరు కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకూడాదన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య జరుగుతున్న సమరంలో క్‌లైమాక్స్‌కు చేరిన విషయం తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి రాందాసు తొలగించారు. తనను తొలగించే అధికారం ఎవ్వరికీలేదంటూ అన్బుమణి దూకుడు ప్రదర్శిస్తున్నారు.ఈ పరిణామాలతో రాందాసు, అన్బుమణి మద్దతుదారులు కయ్యానికి కాలు దువ్వే విధంగా దూకుడుగా ముందుకెళ్తున్నారు. వన్నియర్ సంఘం, పీఎంకే సమావేశాలు అంటూ వేర్వేరుగా కార్యాచరణలో ఉంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దిండివనం వన్నియర్ సంఘం కార్యాలయం ఆవరణలో జరిగిన రగడను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు రాందాసు, అన్బుమణిలకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకున్నారు. వీరి కార్యక్రమంలో దిండివనంలో వన్నియర్ సంఘం నేతృత్వంలో జరిగే వేడుకలో రాందాసు, అన్బుమణి పాల్గొనకుండా నిషేధం విధించే విధంగా ఆ జిల్లా కలెక్టర్‌కు పోలీసు యంత్రాంగం సిఫార్సులు చేయడం గమనార్హం.