
పోషకాహార అవగాహన డ్రైవ్
సాక్షి, చైన్నె : జాతీయ పోషకాహార వారోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిసి క్లినిక్స్ నేతృత్వంలో అవగాహన డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. కిడ్నీ సంరక్షణ దిశగా అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్‌లో భాగంగా ఉన్న అపోలో డయాలసిస్ వైద్యుల బృందం వారం రోజులు ఈ డ్రైవ్ ను నిర్వహించింది.విద్యా కార్యక్రమాలు, రోగులకు అవగాహన అంటూ మల్టీ ఛానల్ అవగాహన ప్రచారాలను సైతం నిర్వహించారు. అపోలో డయాలసిస్ క్లినిక్స్ సీఓఓ ఎం సుధాకరరావు, నెఫ్రాలజిస్టు డాక్టర్ నిత్య శ్రీ నందగోపాల్, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ అగర్వాల్ నేతృత్వంలో విజయవంతంగా ఈ డ్రైవ్ సాగింది. ఈ సందర్భంగా శనివారం వారు ఈ డ్రైవ్ విజయవంతం గురించి పేర్కొంటూ, విద్యా వీడియోలు, వెబినార్లు, రోగికి సంబంధించిన అంశాలు,రోగుల సంరక్షకులకు అనుసరించాల్సిన ఆరోగ్య అంశాలు, ఇలా అనేక అవగాహన కార్యక్రమాలతో ముందుకెళ్లామని వివరించారు.