
క్రైమ్, థ్రిల్లర్‌గా పెణ్‌కోడ్
తమిళసనిమా: మంచి కంటెంట్‌తో కూడిన చిత్రాలకు కేరాఫ్ అంటే మాలీవుడ్ అనే అంటారు. అక్కడ స్టార్ హీరోల కంటే కథలను నమ్మి చిత్రాలను చేస్తున్నారు. అవి మంచి విజయాలను సాధిస్తున్నాయి. అలా మాలీవుడ్ చిత్ర బృందం తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్న చిత్రం పెణ్‌కోడ్. రాజ్ పుత్తణల్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో అరుణ్ సాకో, షరీష్‌దేవ్ హీరోలుగా నటిస్తుండగా లక్ష్మీశాంత, సోనా నాయికలుగా నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఆడ, మగ ఒకటి కాదని, ఇద్దరూ వేర్వేరు గుణాలు కలిగినవారని మనోతత్వవేత్త జి.కృష్ణమూర్తి అంటారన్నారు. మగవాడు రెండు కళ్లతో చూస్తే, సీ్త్ర ఒక్క హృదయంతో చూస్తుందన్నారు. ఇలా ఆడ, మగ వాళ్ల దృష్టిలో భావాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. అలాంటి అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం పెణ్‌కోడ్ అని చెప్పారు. ఆస్త్రియా మూవీ ప్రొడక్షన్స్, జేఎన్‌కేఎల్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు పవిత్ర ఆర్.ప్రసన్న, జయ్ నిత్యాకాశీ లక్ష్మీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం జిత్తన్ రమేశ్ విడుదల చేసి యూనిట్ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని పెణ్‌కోడ్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయనకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపారు.

క్రైమ్, థ్రిల్లర్‌గా పెణ్‌కోడ్