
మిడిల్ క్లాస్ హీరోల కథతో..
తమిళసినిమా: స్టార్స్‌ను నమ్మి చేసే చిత్రాలు, కథలను నమ్మి తెరకెక్కించే చిత్రాలు అంటూ రెండు రెండు రకాలు రూపొందుతుంటాయి. కాగా స్టార్స్ నటించే కమర్షియల్ కథా చిత్రాలకు మాస్ ప్రేక్షకులు ఎక్కువగా చూస్తుంటారు. అదే మంచి కంటెంట్‌తో కూడిన కథ చిత్రాలను కుటుంబ సమేతంగా చూసి ఆనందిస్తారు. ఇలా మంచి కథాంశంతో రూపొందుతున్న చిత్రం మిడిల్ క్లాస్. ధనవంతులు అన్ని రకాల సౌకర్యాలతో జీవించే ఈ ప్రపంచంలో.. ఎక్కువగా గుర్తింపు లేని ఇండియాలోని మిడిల్ క్లాస్ హీరోల ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇది అని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఇన్‌స్టాల్‌మెంట్, రుణమాఫీ, 1బి హెచ్‌కే వంటి అంశాలు, కలలు వంటి అంచాలతో కూడిన ఎమోషన్‌లతో కూడిన వినోద భవిత కథాచిత్రంగా మిడిల్ క్లాస్ కుటుంబాల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. ఇది కథ కాదని ఒక్కో రూపాయిని లెక్క కట్టుకుంటూ చిన్న చిన్న విషయాలతో సంతోషపడుతూ ఇంటి రుణాన్ని తీసుకున్న దానికంటే ఎక్కువగా ఇన్‌స్టాల్‌మెంట్ భారాన్ని మోసే మిడిల్ క్లాస్ ప్రజల జీవన విధానాన్ని అత్యంత సహజత్వంతో చూపే కథ చిత్రం చెప్పారు. ఇది పలువురు జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందన్నారు. మిడిల్ క్లాస్ దంపతులుగా నటుడు మునీష్ కాంత్ విజయలక్ష్మి నటిస్తున్నారని వీరితోపాటూ కాళీ వెంకట్, రాధా రవి, ఖురేషి, మాళవిక అవినాష్, కోడంగి వడివేలు, వేల రామ్మూర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. వర్ధమాన ప్రతిభావంతులను గుర్తించడంలో పేరు గడించిన దివంగత నిర్మాత ఢిల్లీబాబు నమ్మకాన్ని పొందిన ఈ చిత్ర కథను అదేస్థాయిలో రూపొందిస్తున్నట్లు ని ర్మాతలు దేవ్,కెవి దురై పే ర్కొన్నారు. దీనికి సుదర్శన్ శ్రీనివాసన్ ఛాయాగ్రహ ణం, ప్రణవ్ మునిరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.