
వైవిధ్య భరిత కథా చిత్రంగా 2కాయల్
తమిళసినిమా: స్వచ్ఛమైన ప్రేమకు దశాబ్దాలుగా అడ్డుగా మారుతున్నవి కుల మతాలే. అలా మతపిచ్చికి ఒక అందమైన కుటుంబం ఎలా ఛిన్నాభిన్నం అయ్యిందన్న ఇతివృత్తంతో రూపొందిన చిత్రం కాయల్. జే స్టూడియో పతాకంపై ధేసు సుందరమారన్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను దమయంతి నిర్వహించారు. నటి అనుమోల్, లింగేశ్, గాయత్రి, రమేష్ తిలక్, స్వాగత, ఐసక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జస్టిన్ సంగీతాన్ని కార్తీక్ ఛాయాగ్రహణంను అందించారు. పోలీస్ అధికారి కూతురు గాయత్రి. కూతురు అంటే తండ్రికి కూతురంటే అమితమైన ప్రేమ.ఆమె లింగేష్ ప్రేమించుకుంటారు. గాయత్రి తన ప్రేమను తండ్రికి చెబుతుంది. ఆయన కూడా ఆమె ప్రేమకు పచ్చజెండా ఊపుతాడు. అయితే వారి పెళ్లి జరగదు. గాయత్రి తన మేనమామ కొడుకుని పెళ్లి చేసుకుంటుంది. అలాంటిది అనూహ్యంగా గాయత్రి ఆత్మహత్యకు పొల్పడుతుంది. అందుకు కారణాలు ఏమిటి? ఆ తరువాత గాయత్రి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటీ ? లింగేష్‌ను వన్ సైడ్‌గా ప్రేమించిన మరో యువతి ఏమైంది? పోలీస్ అధికారి కొడుకు స్నేహితుడు, సైక్యారిస్ట్ అయిన రమేష్ తిలక్ వారి కుటుంబానికి ఇచ్చిన సలహా ఏమిటీ? ఇత్యాది పలు అసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం కాయల్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.