
13,14 తేదీల్లో తిరువణ్ణామలైలో ఆధ్యాత్మిక సదస్సు
– లక్ష కంటే ఎక్కువ మంది పాల్గొనే అవకాశం
కొరుక్కుపేట: తిరువణ్ణామలైలో ఈనెల 13, 14 తేదీలలో రెండు రోజుల పాటూ వేద ఆగమ దేవర ఆధ్యాత్మిక సాంస్కృతిక సదస్సు జరుగనుంది. ఈ కార్యక్రమం కంచి కామకోటి పీఠం అధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో పాటూ ఆదినామములు, శివాచార్యుల సమక్షంలో జరుగుతుందని నిర్వాహకులు చైన్నె ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు శ్రీవిల్లిపుత్తూరులోని సడగోప రామానుజ జీయర్ , శ్రీపురంలోని శ్రీశక్తి అమ్మవారు, నారాయణీపీఠం, స్వర్ణ దేవాలయం, వెల్లూరు, మేల్మరువత్తూరు అధిపరాశక్తి పీఠంలోని అరుళ్తిరు సెంథిల్‌కుమార్ అడిగలర్, రత్నగిరిలోని శ్రీ బాలమురుగన్ ఆదిమయి స్వాములు, కలవై శ్రీ సచ్చిదానంద స్వామి పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో మొదటి రోజు ఈ నెల13 వ తేదీ శనివారం, ఉదయం తమిళనాడు వ్యాప్తంగా 1,008 మంది శివాచార్యులు పాల్గొని మహా శివపూజ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం స్వామితో పాటు ఆధ్యాత్మిక భక్తులు శ్రీసేవ్వాడైశ్రీ స్వచ్ఛంద సేవకులు పాల్గొని గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కతిక ఊరేగింపు జరుగుతుందన్నారు. దీని తరువాత, సాయంత్రం, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుల ప్రసంగాలు చేసి తమ ఆశీర్వాదాలను అందిస్తారని పేర్కొన్నారు. రెండవ రోజు, 14వ తేదీ ఆదివారం ఉదయంలోక కళ్యాణం కోసం తిరువిళక్కు (పవిత్ర దీపం) పూజ, శ్రీ లలితా సహస్రనామం ,కాంచీ మహాపెరియవ, జీయర్ స్వామిగళ్, తమిళనాడులోని అన్ని ఆధీనాలు, శివాచార్యులు, అలాగే సన్నిదానాలు ఇందులో పాల్గొంటారు. జస్టిస్ రామసుబ్రమణ్యం (మానవ హక్కుల కమిషన్ చైర్మన్) , ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా ప్రసంగిస్తారు. దీని తరువాత, శివాచార్యులు, గురువులు, ఆధ్యాత్మిక నాయకులు, సేవ్వాడై స్వచ్ఛంద సేవకులు అన్ని వర్గాల ప్రతినిధులను సత్కరించి జ్ఞాపికలను అందిస్తారని తెలిపారు ప్రత్యేకించి ఆ రోజు సాయంత్రం, మాస్ట్రో ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా భక్తి సంగీత కచేరీ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 14ని ప్రపంచ సాంస్కృతిక సామరస్య దినోత్సవంగా కూడా పాటించనున్నారని. ఈ సదస్సును ఇళవరసు పట్టం డాక్టర్ పిటి. రమేష్ గురుక్కల్, అరుల్మిగు అరుణాచలేశ్వర ఆలయం, తిరువణ్ణామలై, చీఫ్ ఆర్గనైజర్ శ్రీతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారని , ఉత్సవ కమిటీ సభ్యులు, జగదీష్ కడవుల్ తదితరులు ఏర్పాటు పర్యవేక్షిస్తారని వెల్లడించారు.