
స్వావలంబన ఆధారంగా సార్వభౌమాధికారం
– డాక్టర్ శ్రీధర్ వెంబు
సాక్షి, చైన్నె : జాతీయ సార్వభౌమాధికారం సాంకేతికత, స్వాలంబనపై ఆధారపడి ఉంటుందని జోహొ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు , సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ వెంబు వ్యాఖ్యానించారు. యుద్ధాలు యుద్ద భూమిలోనే కాదు, సాంకేతిక రంగంలో కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాటాన్ కొలత్తూరు వేదికగా ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ ప్లాగ్ షిప్ టెక్నో– మేనేజ్‌మెంట్ ఫెస్ట్ 19వ ఆరుష్–2025 బుధవారం ప్రారంభమైంది. 14వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి ఇంజినీరింగ్, టెక్నాలజీ విద్యార్థులు తరలి వచ్చిన తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. హ్యాక్‌థాన్‌లు, సాంకేతిక సవాళ్లు, ఎంట్రర్ ప్రెన్యూర్ షిప్ బూట్ క్యాంప్‌లు, స్టార్టప్ షోకేష్‌లు, విధాన చర్చలు,నిపుణుల ఉపన్యాసాలు, రన్ ఫర్ జీరో వేస్ట్, సాంస్కృతిక , నాయకత్వం చర్చలు జరగనున్నాయి. ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ వ్యవస్థాపక చాన్స్‌లర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ ఉత్సవాలను చీఫ్ సైంటిస్టు డాక్టర్ శ్రీధర్ వెంబు, పద్మభూషన్ డాక్టర్ ఏ శివధాను పిళ్‌లై ప్రారంభించారు. శ్రీధర్ వెంబు తన ప్రసంగంలో అధునిక ప్రపంచంలో సాంకేతిక స్వావలంబన గురించి వివరించారు. జాతీయ సార్వభౌమాధికారం సాంకేతికత, స్వావలంబనపై ఆధారపడి ఉందన్నారు. జీపీఎస్, ఆపరేటింగ్ సిస్టమ్‌లు లేదా చాట్ జీపీటీ వంటి ప్లాట్ ఫారమ్‌లపై ఆధార పడలేదమని వ్యాఖ్యానించారు. వీటిని క్షణాలలో తొలగించేందుకు వీలుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నితిన్ ఎం నాగర్కర్ తదితరులు పాల్గొన్నారు.