
20 గ్రామాల్లో జాతర సందడి
పళ్లిపట్టు: పళ్లిపట్టు మండల వ్యాప్తంగా 20 గ్రామాల్లో మంగళవారం జాతర సందడి నెలకొంది. పొదటూరుపేట, జంగాళపల్లె. బొమ్మరాజుపేట, చవటూరు, కేశవరాజుకుప్పం, గొళ్లాలకుప్పం, కాకళూరు, అత్తిమాంజేరిపేట సహా 20 గ్రామాల్లో జాతరను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో విద్యుద్దీపాలంకరణ కనువిందు చేసింది. మంగళవారం రాత్రి అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మేకలను బలిదానం చేసి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం గ్రామ వీధుల్లో కొలువైన అమ్మవారికి మహిళలు కుంభం సమర్పించి దర్శించుకున్నారు. సాయంత్రం ఊరేగింపుగా తరలించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. పొదటూరుపేటలోని మారియమ్మన్ జాతర సందర్భంగా బుధవారం ఉదయం పొన్నియమ్మన్‌ను పట్టణ వీధుల్లో ఊరేగించారు. మహిళలు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకున్నారు. అదే సమయంలో నడివీధిలో కొలువైన మారియమ్మన్‌కు మహిళలు కుంభం వేసి దర్శించుకున్నారు. పాండ్రవేడు గ్రామంలో జాతర సందర్భంగా సందడి నెలకొంది. బొమ్మరాజుపేట గ్రామంలో జాతర సందర్భంగా బాణసంచా సంబరాలు ఆకట్టుకున్నాయి.
బొమ్మరాజుపేటలో బాణసంచా సంబరాలు, పొదటూరుపేటలో మారియమ్మన్‌కు కుంభం సమర్పిస్తున్న మహిళలు

20 గ్రామాల్లో జాతర సందడి

20 గ్రామాల్లో జాతర సందడి