
విజయ్ ప్రజలతో మాట్లాడితే చాలు
వేలూరు: టీవీకే అధ్యక్షుడు విజయ్ బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడాలని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం పరిధిలోని 12వ వార్డు కనిఅముదం కల్యాణ మండపంలో మీతో స్టాలిన్ పథకం కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అక్కడికక్కడే అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు తీర్పు ప్రకారం తాము కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేస్తామని ప్రస్తుతం ప్రకటించదని అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలు కురిసి నీరు బాగా ఉందన్నారు. ప్రస్తుతం తమిళుడైన సీపీ రాధాక్రిష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని ఆయనకు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పరిస్థితి గురించి విలేకరులు ప్రశ్నించగా వాటి గురించి తాను మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేదన్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ పర్యటన గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన ఎప్పుడు పర్యటకు వచ్చినా తమకు భయం లేదని ప్రజల వద్దకు వచ్చి నేరుగా మాట్లాడితే చాలన్నారు. ప్రజల వద్దకు రావడానికి ఎందుకు శని, ఆదివారాలు అన్నారు. మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, జోన్ చైర్మన్ పుష్పలత, తహసీల్దార్ జగదీశ్వరన్ పాల్గొన్నారు.