
కీచ్చళంలో స్టాలిన్ శిబిరం
పళ్లిపట్టు: పళ్లిపట్టు మండలంలోని కీచ్చళం గ్రామంలో మీతో స్టాలిన్ శిబిరం మంగళవారం నిర్వహించారు. కీచ్చళం, జంగాళపల్లె, నెడిగళ్లు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శిబిరంలో ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి ప్రజలు అందజేసిన అర్జీలకు సంబంధించి పరిశీలన చేశారు. మహిళలకు ప్రతినెలా రూ.1000 ఆర్థికసాయం ద్వారా లబ్ధిపొందేందుకు వచ్చిన వినతిపత్రాలపై అధికారులు వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకోవాలని, అలాగే రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ సహా ప్రధాన శాఖల ద్వారా విచ్చిన వినతిపత్రాలకు వెంటనే స్పందించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఆరోగ్యశాఖ ద్వారా గర్భిణులకు పౌష్టికాహార కిట్లు, పంచాయతీరాజ్‌శాఖ ద్వారా కలైంజర్ ఇళ్ల నిర్మాణం పథకం ద్వారా అర్హులకు వర్క్ ఆర్డర్లు పంపిణీ చేశారు. మండల డీఎంకే కార్యదర్శి రవీంద్ర. తహసీల్దార్ భారతి, బీడీఓలు అర్పుదరాజ్, అరుల్, డీఎంకే నేతలు గోపి, శివానందం పాల్గొన్నారు.