మళ్లీ కోర్టుకు పీఎంకే పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కోర్టుకు పీఎంకే పంచాయితీ

Sep 11 2025 2:39 AM | Updated on Sep 11 2025 2:39 AM

మళ్లీ కోర్టుకు పీఎంకే పంచాయితీ

మళ్లీ కోర్టుకు పీఎంకే పంచాయితీ

– రామన్న కేవియేట్‌ పిటిషన్‌ దాఖలు

సాక్షి, చైన్నె: పీఎంకే వివాదాల పంచాయితీ మళ్లీ కో ర్టుకు చేరింది. ఈ సారి పార్టీ పేరు, జెండా, చిహ్నంను రక్షించుకునేందుకు ముందస్తు వ్యూహంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు కేవియేట్‌ పిటిషన్‌ ను హైకోర్టులో బుధవారం దాఖలు చేశారు. వివరాలు.. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన త నయుడు అన్బుమణి మధ్య సాగుతున్న అధికార స మరం గురించి తెలిసిందే. నాయకులు, కేడర్‌ రెండు బృందాలుగా ఈ వివాదం పుణ్యమా విడి పోయి ఉ న్నారు. సీనియర్లు అయితే, ఈ ఇద్దరి మధ్య నలిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్బుమణిని పార్టీ నుంచి బయటకు పంపించేందుకు రాందాసు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. రెండు సార్లు క్ర మ శిక్షణ కమిటీ నోటీసులు పంపినా, అన్బుమణి నుంచి సమాధానం రాక పోవడాన్ని రాందాసు తీ వ్రంగా పరిగణించారు. అన్బుమణిని బయటకు ప ంపించిన పక్షంలో పార్టీని హైజాక్‌ చేస్తారేమో అన్న బెంగ రాందాసులో ఉన్నట్టు సమాచారం. రాందాసు వెన్నంటి సీనియర్లు ఉన్నా, యువ రక్తం అంతా అన్బుమణి చుట్టూ ఉండటంతో ఎక్కడ పార్టీని తన గుప్పెట్లోకి ఆయన తెచ్చుకుంటారో అన్న బెంగ రాందాసు మద్దతు దారుల్ని వీడడం లేదు.

ముందు జాగ్రత్తగా..

ఇది వరకు రాందాసు శిబిరానికి పోటీగా అన్బుమణి పీఎంకే సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా కోర్టును రామన్న తట్టినా ప్రయోజనం శూన్యం. అన్బుమణి తన నేతృత్వంలో సర్వ సభ్య సమావేశాన్ని విజయవంతంచేసుకుని, నేతల పదవీ కాలాలన్నీ మరో ఏడాది పొడిగించుకున్నారు. అదే సమయంలో రాందాసు సైతం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన అన్ని అధికారాలు తనకే అని చాటుకున్నారు. ఈపరిణామాలు ఓ వైపు ఉంటే, మున్ముందు ఎదురయ్యే పరిస్థిలతో ఎక్కడ పార్టీ పేరు, జెండా, చిహ్నంను అన్బుమణి తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడోనన్న బెంగతో ముందస్తు జాగ్రత్తలో రాందాసు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా అన్బుమణికన్నా ముందుగా హైకోర్టు తలుపు తట్టారు. పార్టీ పేరు, చిహ్నం, జెండాను తన గుప్పెట్లో తీసుకునేందుకు అన్బుమణి తీవ్ర ప్రయత్నాలలో ఉన్న సమాచారంతో రాందాసు మేల్కొని ముందుగానే బుధవారం హైకోర్టులో కేవియేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ పేరు, జెండా, చిహ్నం విషయంగా అన్బుమణి గానీ, మరెవరైనా గానీ పిటిషన్‌ దాఖలు చేసిన పక్షంలో ముందుగా తన వాదనను వినాలని , తన వివరణను తప్పని సరిగా స్వీకరించాలని ఆ కేవియేట్‌ పిటిషన్‌ ద్వారా న్యాయ స్థానాన్ని రాందాసు అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement