ఆమ్నీ బస్సులో రూ. 4.42 కోట్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఆమ్నీ బస్సులో రూ. 4.42 కోట్లు స్వాధీనం

Sep 10 2025 2:17 AM | Updated on Sep 10 2025 2:17 AM

ఆమ్నీ

ఆమ్నీ బస్సులో రూ. 4.42 కోట్లు స్వాధీనం

అన్నానగర్‌: చైన్నె మన్నడి నుంచి పరమకుడికి వెళుతున్న ప్రైవేట్‌ ఆమ్నీ బస్సులో పెద్ద మొత్తంలో డబ్బు రవాణా చేస్తున్నట్లు చెంగల్పట్టు జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మధురాంతకం సమీపంలోని అత్తూర్‌ టోల్‌ బూత్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆచారి పక్కం పోలీసులు చైన్నె నుంచి వస్తున్న ప్రైవేట్‌ ఆమ్నీ బస్సులో సోదాలు చేయగా.. మధురైలోని కామరాజ్‌ సాలై నివాసి అయిన గణేశన్‌ 4 పెద్ద సంచులతో రూ. 3.92 కోట్లు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఈ డబ్బు కారైకుడికి చెందిన ఓ వ్యాపారవేత్తదని తెలిసింది. అదే బస్సులో ఉన్న చైన్నెలోని తిరువళ్లికేనికి చెందిన అంబ్రోస్‌ బ్యాగులో రూ. 50 లక్షల నగదును గుర్తించారు. ఈ డబ్బు రామనాథపురం జిల్లా పుత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తిదని సమాచారం. కానీ ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు వారి వద్ద లేవు. దీని తర్వాత, పోలీసులు రూ.4 కోట్ల 42 లక్షలను స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ఇది హవాలా నగదా..? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.

23 నుంచి గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌

సాక్షి, చైన్నె: ఆన్‌లైన్‌ వర్తకం వేదికగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ ఈనెల 23వ తేదీన ప్రారంభం అవుతుందని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సౌరభ్‌ శ్రీవాస్తవ తెలిపారు. పండుగ సీజన్లను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు విస్తృత ఎంపిక కోసం అన్ని రకాల వస్తువులను అమెజాన్‌లో కొలువు దీర్చనున్నామని మంగళవారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రకటించారు. దేశంలోనే అతి పెద్ద షాపింగ్‌ వేడుకగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ ఉండబోతున్నట్టు ఽధీమా వ్యక్తం చేశారు. జీఎస్‌టీ తగ్గింపు నేపథ్యంలో పలు రకాల కొత్త ఉత్పత్తులు సైతం కొలువు దీర్చనున్నామని , ఈ వస్తువుల డెలవరీ కోసం కొత్తగా 45 డెలవరీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో తమిళనాడులోని మరైమలై, తిరుచ్చి, ఆంధ్రప్రదేశ్‌లో నర్సిపట్నం, వంటి టైర్‌ 2, టైర్‌ 3 నగరాలు ఉన్నాయని ప్రకటించారు. ఇటీవల 12 కొత్త పుల్‌ ఫిల్మెంట్‌ సెంటర్లు, 6 కొత్త స్టార్టింగ్‌ సెంటర్లతో నెట్‌వర్క్‌ సేవలను విస్తరించామని గుర్తుచేశారు. ఆపరేషన్స్‌ విభాగం ఉపాధ్యక్షుడు అభినవ్‌ సింగ్‌ మాట్లాడుతూ, వినియోగదారుల కోసం అన్ని రకాల వస్తువులు తీసుకు రావడమే కాదు, ఆనందాన్నిసైతం కలిగించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.

పళణితో ఈరోడ్‌ నేతల భేటీ

సేలం: ఈరోడ్‌ రూరల్‌ వెస్ట్‌ జిల్లా నిర్వాహకులు పెద్దసంఖ్యలో మంగళవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో సమావేశయ్యారు. సెంగోట్టయన్‌ను ఆ జిల్లా కార్యదర్శి పదవి నుంచి పళణిస్వామి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఏకే సెల్వరాజ్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ పరిస్థితులలో ఈరోడ్‌ రూరల్‌ వెస్ట్‌ జిల్లాలోని అందియూరు, గోపి చెట్టి పాళయం, భవానీసాగర్‌ తదితర అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ముఖ్య నేతలందరూ పళణిస్వామిని కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. సేలం హైవే నగర్‌లోని పళణిస్వామి నివాసానికి మంగళవారం వెళ్లి మరీ తమ మద్దతు తెలియజేశారు. ఆయన్ను సత్కరించారు. వీరంతా సెంగోట్టయన్‌కు వ్యతిరేకంగా జిల్లాలో పావులు కదిపే పనిలో పడటంతో ఈరోడ్‌ రాజకీయం రసవత్తరంగా మారినట్లయ్యింది.

చైన్నె పోలీసు కమిషనర్‌

నేతృత్వంలో స్పెషల్‌ గ్రీవెన్స్‌ డే

తిరువొత్తియూరు: చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీసుల ఫిర్యాదుల పరిష్కార ప్రత్యేక శిబిరంలో 146 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నుంచి ఫిర్యాదులను స్వీకరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ ఫిర్యాదుల పరిష్కార ప్రత్యేక శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ (ఇనన్‌ఛార్జ్‌: హెడ్‌ క్వార్టర్స్‌) జి. కార్తికేయన్‌, ఐ.పి.ఎస్‌., డిప్యూటీ కమిషనర్లు శ్రీనాథ్‌, ఐ.పి.ఎస్‌., (సైబర్‌ క్రైమ్‌), బి. గీత (హెడ్‌ క్వార్టర్స్‌), పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆమ్నీ బస్సులో రూ. 4.42 కోట్లు స్వాధీనం 
1
1/2

ఆమ్నీ బస్సులో రూ. 4.42 కోట్లు స్వాధీనం

ఆమ్నీ బస్సులో రూ. 4.42 కోట్లు స్వాధీనం 
2
2/2

ఆమ్నీ బస్సులో రూ. 4.42 కోట్లు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement