
‘అందరికీ ఏఐ 2.ఓ’
సాక్షి, చైన్నె : అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2. ఓ పేరిట అన్ని తరగతుల పాఠశాలల ఉపాధ్యాయులకు స్వయం ప్లస్ ఉచిత ఏఐ కోర్సులను విస్తరించేందుకు ఐఐటీ మద్రాసు నిర్ణయించింది. ఇందుకోసం ఉచిత ఏఐ కోర్సుల రెండవ దశ కిండర్ గార్టెన్ నుంచి ప్లస్–2 వరకు ఉపాధ్యాయులు దృష్టి పెట్టే విధంగా దరఖాస్తుల నమోదుకు చర్యలు తీసుకుంది. అక్టోబరు 10 చివరి రోజుగా నిర్ణయించారు. ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఆన్‌లైన్ మోడ్‌లో స్వయం ప్లస్ ద్వారా ఈ కోర్సులను అందించనున్నారు.
గతంలో అందించిన ఐదు కోర్సులతో పాటు (భౌతిక శాస్త్రంలో ఏఐ, రసాయన శాస్త్రంలో ఏఐ, అకౌంటింగ్‌లో ఏఐ, ఏఐతో క్రికెట్ అనలిటిక్స్ పైథాన్ ఉపయోగించి ఏఐ) ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ అనే కొత్త కోర్సును ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. వీటి వ్యవధి 25 నుంచి 45 గంటల మధ్య ఉంటుందని ఉచితంగా అందించబడుతోందని, సర్టిఫికేషన్ కోరుకునే వారు నియమించబడిన కేంద్రాలలో ప్రొక్టార్డ్ పరీక్షల ద్వారా నామమాత్రపు రుసుముతో కోర్సును పొందవచ్చని ప్రకటించారు. బోధన, మూల్యాంకనం, విద్యార్థులను మెరుగుపరచడానికి అవసరమైన ఏఐ జ్ఞానం, ఆచరణాత్మక సాధనాలను పొందడానికి ఉపాధ్యాయులు, ఆశావహులైన ఉపాధ్యాయులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ కోర్సులు ఏఐ విద్యను అన్ని విభాగాలలో కలుపుకొని, అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అన్నిరకాల విద్యార్థులకు..
ఇవి ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా కళలు, సైనన్స్, వాణిజ్యం, ఇతర రంగాల నుంచి నేర్చుకునేవారి కోసం కూడా రూపొందించబడిందని వివరించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మంగళవారం క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇతర వాటాదారుల సమక్షంలో కొత్త ఏఐ కోర్సును ప్రారంభించారు. ఆరు కోర్సులకు దరఖాస్తుల చివరి తేది అక్టోబరు 10గా ప్రకటించారు. ఈ క్రింది లింక్ ద్వారా pm u&rp@rwayam2.ac.in, httpr://rwayam& pur.rwayam2.ac.in/ai&gor&a&courrer వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ, ‘కృత్రిమ మేధస్సు అభ్యాస భవిష్యత్తును పునర్ నిర్మిస్తోందన్నారు. తరగతి గదుల్లోకి ఈ మార్పును తీసుకురావడం దిశగా ఏఐ నైపుణ్యాలతో ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడం ద్వారా విద్యను బలోపేతం చేయడమే కాకుండా దేశ నిర్మాణానికి కూడా దోహదకరంగా ఉంటుందన్నారు. భారతదేశం అంతటా ఉన్న పాఠశాల ఉపాధ్యాయులను దరఖాస్తు చేసుకోవచ్చు అని, ఈ చొరవ నుంచి ప్రయోజనం పొందమని ఆహ్వానిస్తున్నామని ఐఐఖీ మద్రాస్ డీన్ (ప్లానింగ్) ప్రొఫెసర్ ఆర్. సారథి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. ఏఐ లేదా కోడింగ్‌లో ముందస్తు అనుభవం అవసరం లేదని, ప్రాథమిక డిజిటల్ అక్షరాస్యత, నేర్చుకోవడానికి ఉత్సాహం ఉంటే సరిపోతుందన్నారు.