సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు | - | Sakshi
Sakshi News home page

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

Sep 10 2025 2:17 AM | Updated on Sep 10 2025 2:17 AM

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

సాక్షి, చైన్నె: చైన్నె– తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల కోసం సౌకర్యం, భద్రత పెంపు దిశగా దక్షిణ రైల్వే చర్యలు తీసుకుంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రస్తుతం ఉన్న రైలు రేక్‌ కోచ్‌లను ఎల్‌ హెచ్‌బీ(లింక్‌ – హాఫ్‌మన్‌– బుష్‌) కోచ్‌లుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌ నుంచి తిరుపతి మధ్య రాక పోకలు సాగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సెప్టెంబరు 20వ తేదీ నుంచి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడవనున్నట్టు దక్షిణ రైల్వే మంగళవారం ప్రకటించింది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చనున్న దృష్ట్యా, 16053/16504, 16057/6058 నెంబర్లతో డాక్టర్‌ ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌– తిరుపతి– డాక్టర్‌ ఎంజీఆర్‌ సెంట్రల్‌ మధ్య సప్తగిరి రైలు నడుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఒక ఏసీ చైర్‌ కోచ్‌, 10 చైర్‌ కార్‌ కోచ్‌, 4 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌, ఒక సెకండ్‌ క్లాస్‌ కోచ్‌(దివ్యాంగులకు అనుకూలంగా), ఒక లగేజ్‌ కమ్‌ బ్రేక్‌ వ్యాన్‌ కోచ్‌గా రైలు పట్టాలు ఎక్కుతుందని వివరించారు. అలాగే కాచీగూడా – చెంగల్పట్టు – కాచీగూడా ఎక్స్‌ప్రెస్‌లో ఓ స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ స్థానంలో ఓ ఏసీ త్రీ టైర్‌ కోచ్‌ను డిసెంబర్‌ 6వ తేదీ నుంచి చేర్చానన్నారు. కాకినాడ పోర్ట్‌ – చెంగల్పట్టు – కాకినాడ పోర్ట్‌ సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ స్థానంలో ఒక ఏసీ త్రీ టైర్‌ కోచ్‌ డిసెంబరు 7 నుంచి చేర్చనున్నారు. కాచీగూడా – పుదుచ్చేరి– కాచీగుడా ఎక్స్‌ప్రెస్‌లో ఒక ఏసీ త్రీ టైర్‌ కోచ్‌ ను ఒక స్లీపర్‌ కోచ్‌ స్థానంలో డిసెంబర్‌ 5 నుంచి అమల్లోకి తీసుకు రానున్నారు. కాకినాడ పోర్టు – పుదుచ్చేరి –కాకినాడ పోర్టు సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక స్లీపర్‌ కోచ్‌ స్థానంలో ఒక ఏసీ త్రీ టైర్‌ కోచ్‌ను డిసెంబరు 8 నుంచి చేర్చనున్నారు. అలాగే, బెంగళూరు – నాగర్‌ కోయిల్‌ – ఎస్‌ఎంబీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోనూ ఒక స్లీపర్‌ కోచ్‌ స్థానంలో ఒక ఏసీ త్రీ టైర్‌ కోచ్‌ను డిసెంబరు 4 నుంచి చేర్చనున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement