
క్లుప్తంగా
తిరువొత్తియూరు: చైన్నె సూళైమేడు ప్రాంతంలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ద్విచక్ర వాహనంతో ప్రమాదం సృష్టించిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సూళైమేడు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి హోంగార్డు విఘ్నేష్ (24) తన ద్విచక్ర వాహనంతో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో విఘ్నేష్ మద్యం తాగి ఉన్నట్లు తేలింది. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం డ్యూటీలో ఉన్న అరుంబాక్కం రోడ్డు గస్తీ పోలీసు అధికారి విజయకుమార్ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న హోంగార్డు విఘ్నేష్ పోలీసుపై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. దీంతో పోలీసు అధికారి విజయకుమార్ సూళైమేడు పోలీస్ స్టేషనన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మద్యం మత్తులో పోలీసు అధికారిపై దాడి చేసిన హోంగార్డు విఘ్నేష్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తిరువళ్లూరు: ట్రాక్‌ను దాటే క్రమంలో రైలు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా పుట్లూరు అంబేడ్కర్ నగర్ ప్రాంతానికి చెందిన మణి(67) వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణమైన క్రమంలో రైల్వే ట్రాక్ దాటడానికి యత్నించాడు. ఈ సమయంలోనే ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన ఇన్‌స్పెక్టర్ రవిచంద్రన్ మృతదేహాన్ని కై వసం చేసుకుని శవపరిక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సాక్షి, చైన్నె: దక్షిణ భారత థ్రిల్లర్‌గా డిటెక్టివ్ ఉజ్వలన్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో ప్రీమియర్‌గా సెప్టెంబర్ 12న లయన్స్ గేట్ ప్లేలో విడుదల కానున్నది. ఈ వివరాలను మంగళవారం స్థానికంగా ప్రకటించారు. డిటెక్టిక్ ఉజ్వలన్ డార్క్ కామెడీ, హర్రర్, మిస్టరీతో విచిత్ర అంశాలతో రూపుదిద్దుకున్నట్టు వివరించారు. ధ్యాన్ శ్రీనివాసన్ విచిత్రమైన డిటెక్టివ్‌గా ఉజ్వలన్ పాత్రను పోషించారని, నూతన ద్వయం ఇంద్రనీల్, గోపీకృష్ణన్, రాహుల్ జీ దర్శకతవంలో వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్స్‌పై సోఫియా పాల్ డిటెక్టివ్ ఉజ్వలన్‌ను నిర్మించినట్టు పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రదర్శన గురించి నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ పేర్కొంటూ, డిటెక్టివ్ ఉజ్వలన్ ప్రేక్షకులు మెచ్చే పాత్రగా, సరికొత్త హృదయ స్పందనతో ఉంటుందని వివరించారు.
తిరువొత్తియూరు: కొడుంగయూరు ఎళిల్ నగర్‌కు చెందిన మణికంఠన్. అతని వద్ద నుంచి ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు సెల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయారు. ఈ ఘటనపై మణికంఠన్ కొడుంగయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి సెల్‌ఫోన్ అపహరించిన అముల్‌రాజ్, సంతోష్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను, ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తిరువొత్తియూరు: విధి నిర్వహణలో ఉత్తమ సేవలను అందించిన పోలీసు అధికారులను, సిబ్బందిని స్వయంగా చైన్నె నగర పోలీస్ కమిషనర్ అరుణ్ పిలిచి బహుమతులిచ్చి అభినందించారు. వివరాలు.. 2015వ సంవత్సరంలో అడయార్ పోలీస్ జిల్లాలో నివసిస్తున్న 9 సంవత్సరాల బాలికపై జరిగిన లైంగిక వేదింపు కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్న తరమణి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి.ఎన్.ధర్మ నేతృత్వంలోని బృందాన్ని అభినందించారు. అలాగే చెన్‌నై నగర పోలీస్, –1 సెయింట్ థామస్ మౌంట్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జి.కరికాలన్ అందిన సమాచారం మేరకు, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ కరికాలన్, కానిస్టేబుళ్లు డి.బాలాజీ, ముని స్వామి ఆలందూరులోని ఓ లాడ్జికి వెళ్లి తనిఖీలు నిర్వహించి, గంజాయి కలిగి ఉన్న 17 సంవత్సరాల యువకుడిని విచారణ జరిపి, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందాన్ని కూడా కమిషనర్ అభినందించారు. తిరువొత్తియూర్‌లోని ప్రజా ఫిర్యాదుల శిబిరంలో మూర్ఛ వచ్చిన 2 సంవత్సరాల చిన్నారిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చిన స్పెషల్ సబ్–ఇన్‌స్పెక్టర్‌కు మారిదురై ను పిలిపించి రికార్డు అందజేశారు.

క్లుప్తంగా