
చదువుకున్న పాఠశాలకు పేరు తీసుకురావాలి
వేలూరు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత విద్యను అభ్యసించి చదివిన పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని పాఠశాల కమిటీ చైర్మన్, కార్పొరేటర్ అన్బు అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం విద్యార్థులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తారకేశ్వరి, టీచర్‌లు బాబు, జనార్ధనన్, విద్యార్థులు పాల్గొన్నారు.
గుర్తింపు కార్డులను అందజేస్తున్న చైర్మన్ అన్బు