
లైట్స్ ఆఫ్ చేసి.. చీకట్లో అలా..
నటి అనుపమ
పరమేశ్వరన్
తమిళసినిమా: ఒక్కొకరిది ఒక్కో అభిరుచి. ఇష్టాఇష్టాలు కూడా అంతే. పబ్లిక్‌గా సాధ్యం కాని ఇష్టాలను చాటుగా చేసి సంతృప్తి పడుతుంటాం. అలా తన ఇష్టం గురించి నటి అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. ప్రేమమ్ అనే మలయాళ చిత్రంతో నలుగురు కథానాయికల్లో ఒకరిగా పరిచయమైన నటి అనుపమ పరమేశ్వరన్. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా, ఈ అమ్మడిని తెలుగు ప్రేక్షకులే ఆదరిస్తున్నారు. తమిళంలో కొడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ పెద్దగా అవకాశాలు పలకరించలేదు. ఆ మధ్య రవిమోహన్‌కు జంటగా సైరన్ చిత్రంలో, ఇటీవల డ్రాగన్ చిత్రంలో నటించినా ఈమెకు పెద్దగా ఫలితం దక్కలేదు. తాజాగా మారిసెల్వరాజ్ దర్శకత్వంలో దవ్ విక్రమ్‌కు జంటగా నటించారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై అనుపమ పరమేశ్వరన్ చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఇకపోతే ఈమె తెలుగులో నటించి కిష్కింధపురి చిత్రం ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుంది. హారర్ సన్నివేశాలు చోటు చేసుకున్న ఇందులో అనుపమ పరమేశ్వరన్ దెయ్యం గెటప్‌లో భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈ అమ్మడు ఒక సమావేశంలో తనకు హారర్ కథా చిత్రాలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. తాను చిన్నతనం నుంచే హారర్ కథా చిత్రాలను రహస్యంగా చూస్తానని చెప్పారు. తన తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించిన తరువాత లైట్స్ ఆఫ్ చేసి చీకటిలో హారర్ కథా చిత్రాలను చూస్తానని చెప్పారు. మరి అలా తను ఇష్టపడే హారర్ కథాంశంతో రూపొందిన కిష్కింధపురి చిత్రం అనుపమ పరమేశ్వరన్ కేరీర్‌కు ఏ మాత్రం హెల్ప్ అవుతుందో చూడాలి. ఇటీవల ఈమె నటించిన పరదా చిత్రం పూర్తిగా నిరాశ పరిచిందన్నది గమనార్హం.