
హీరోయిన్‌కు విజయ్ అభిమానుల రక్ష
తమిళసినిమా: ఒక్కో సారి చిత్ర యూనిట్‌కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే ఇరవిన్ విళిగళ్ చిత్ర కథానాయిక ఎదుర్కొన్నారు. మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్ నిర్మిస్తున్న చిత్రం ఇరవిన్ విళిగళ్. సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి నిమారే నటిస్తున్నారు. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్నారు. నటుడు నిళల్‌గళ్ రవి, మస్కారా అస్మిత, గుంతాజ్, ఆన్సీ, చరణ్‌రాజ్, సిజర్ మనోహర్, ఈశ్వర్ చంద్రబాబు, కిళి రామచంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్ నిమారే చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్ అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్‌కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టి ప్రారదోలారని చెప్పారు. ఈ సంఘటనతో నటి నిమారే చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్ విళిగల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.
ఇరవిన్ విళిగళ్ చిత్రంలో నటి నిమారే తదితరులు