
గ్రీవెన్స్‌డేలో 383 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 383 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. గ్రీవెన్స్‌డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. పట్టాలు కోసం 39 వినతులు, పక్కాగృహాల కోసం 10, ఉపాధి కోసం 28, మౌలిక సదుపాయాలతో సహా ఇతర వాటి కోసం 275 వినతులతో కలిపి మొత్తం 383 వినతులు వచ్చాయి. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్ ప్రతాప్, వాటిని తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం దాదాపు గంటపాటు అధికారులతో గత వారం స్వీకరించిన వినతులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ సురేష్, పీఏజీ వెంకట్రామన్, స్పెషల్ తహశీల్దార్ బాలమురుగన్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌డేకు రెవెన్యూ, పోలీసులు, పీడబ్ల్యూడీ, గ్రామీణాబివృద్ధి, అగ్నిమాపకశాఖ, ఎడ్యుకేషన్, సర్వేయర్ విభాగం తదితర అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.