
ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్
కొరుక్కుపేట: ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కీలంబాక్కం–చెట్టి పున్నియం మధ్య హై–లెవల్ వంతెన రానుంది. దీనిని రూ.3,200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు అధికారులు వెల్లడించారు. పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలలో తాంబరం గేట్ వద్ద 3 కి.మీ వరకు జీఎస్టీ రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూనే ఉంటుంది. చైన్నెకి ఇది ప్రధాన మార్గం కాబట్టి ట్రాఫిక్ ఎల్లప్పుడూ కనిపిస్తుంది. జీఎస్టీ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో రూ.3200 కోట్లుతో 18.4 కిలో మీటర్లు దూరానికి హై లెవల్ వంతెన ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.